వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యమం జరిగింది దేనికి: కెసిఆర్ చేస్తున్నదేమిటి?

తెలంగాణ సాంస్కృతిక విధానాన్ని రూపొందించి, అందులో అందరినీ భాగస్వాములను చేయడంలో కెసిఆర్ విఫలమయ్యారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం రైతుల చేతులకు సంకెళ్లు వేయడం, హైదరాబాద్ ధర్నా చౌక్‌లో ఆందోళనకారులను పోలీసులు చితకబాదడం వంటి సంఘటనల వల్లనే కాదు, మరో రూపంలో కూడా చాప కింద నీరులా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై అసంతృప్తి పేరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమాకాల కోసం జరిగిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తప్ప ఆ రంగాల్లో తెలంగాణకు న్యాయం జరగదని తెలంగాణ ఉద్యమ కాలంలో దండిగా ప్రచారం చేసిన విషయం తెలియంది కాదు. అదే సమయంలో సాహిత్య, సాంసృతిక రంగాల్లో విస్మరణ, వివక్షలకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ ఉద్యమం గొంతెత్తింది.

సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆంధ్ర ఆధిపత్యాన్ని తోసిరాజని, తెలంగాణ ఆధిపత్యాన్ని సొంత రాష్ట్రంలో నెలకొల్పడం కూడా తెలంగాణ రాష్ట్ర పాలకుల ధ్యేయంగా ఉంటుందని భావించారు. ఉద్యమ కాలంలో కెసిఆర్ మాటలు కూడా అదే రీతిలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే చాప కింద నీరులా పరుచుకుంటూ పోతోంది.

తెలంగాణ పునర్నిర్మాణం కోసం...

తెలంగాణ పునర్నిర్మాణం కోసం...

తెలంగాణ పునర్నిర్మాణం తన కర్తవ్యమని ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కెసిఆర్ పలుమార్లు చెప్పారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో ధ్వంసమైన తెలంగాణను పునర్మించుకోవాలనే లక్ష్యం దిశగా ఆయన సాగుతారని ఆ మాటలు చెబుతున్నప్పుడు అందరూ అనుకున్నారు. అది కేవలం కొన్ని రంగాల్లో కాకుండా అన్ని రంగాల్లో జరుగుతుందని భావించారు. కానీ, సాహితీ, సాంస్కృతిక రంగాల్లో అది కనిపించడం లేదు. విస్మరణను, వివక్షను అధిగమించి ఈ రంగాల్లో కూడా ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని తెలంగాణ రచయితలు, కళాకారులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

సాంస్కృతిక విధానం వద్దా....

సాంస్కృతిక విధానం వద్దా....

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఓ స్పష్టమైన సాంస్కృతిక విధానం రూపుదాలుస్తుందనే ఆశ ఉంటూ వచ్చింది. కానీ, ఆ పని జరగడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆ దిశగా పనిచేసిన మెజారిటీ కళాకారులకు, రచయితులకు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో చోటు లేకుండా పోయింది. ఈ రంగాలకు సంబంధించిన ఉద్యమం చేసిన కొద్ది మందికి (వారు అర్హులే) చోటు కల్పించి, మిగతావారిని కెసిఆర్ నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. నిర్లక్ష్యం చేసినా ఫరవాలేదు గానీ తెలంగాణతనాన్ని దరికి కూడా రానీయని కవులను, రచయితలను చాలా మందిని ఆయన ఆహ్వానించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని, అందుకు పాటలు రాయాలని ఆయన కోరారు. అదేమంత తప్పు కాదు. కానీ, ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులు పునర్నిర్మాణానికి పనికి రారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

తెలంగాణ తోవలు వేసిన....

తెలంగాణ తోవలు వేసిన....

కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందే తెలంగాణ సాంస్కృతిక వేదిక ఆవిర్భవించింది. అందులో చాలా మంది కళాకారులు, కవులు, రచయితలు భాగస్వాములయ్యారు. తీవ్రమైన దాడిని ఎదుర్కుంటూ కూడా దాన్ని ముందుకు తీసుకుపోయే పనిచేశారు. తెలంగాణ సంస్కృతి ఎలా విశిష్టమైందో, ప్రత్యేకమైందో తెలంగాణ సాంస్కృతిక వేదిక చెప్పే ప్రయత్నం చేసింది. వంటల నుంచి పెద్దలను సత్కరించే వరకు తెలంగాణ సంస్కృతి విశిష్టతను, ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా చేసి చూపించింది. సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక రంగాల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి, ఉనికిని ప్రదర్శించుకోవడానికి చేయాల్సిన పనేమిటో తెలియజేస్తూ తెలంగాణ తోవలు అనే పుస్తకాన్ని కూడా అచ్చేసింది. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మార్గం చూపుతుందని భావించింది. ఆ మార్గంలోనే ప్రత్యేకత, విశిష్టతల ద్వారా ఉనికిని చాటు కోవడమే కాకుండా ఆత్మగౌరవాన్ని ప్రోది చేసుకోవాలని కళాకారులు, రచయితలు భావించారు. కానీ, వారి ఆత్మగౌరవం దెబ్బ తినే పరిస్థితులు తెలంగాణ కళా, సాంస్కృతిక రంగాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. దీనికి ఉదాహరణలు చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ కవులతో ఇటీవల కెసిఆర్ నిర్వహించిన సమావేశమే అందుకు నిదర్శనం.

మే 31 పుస్తకం....

మే 31 పుస్తకం....

తెలంగాణలో ఆంధ్ర ఆధిపత్యంలోని జర్నలిజం ఈ ప్రాంతానికి చేస్తున్న నష్టమేమిటో వివరించడానికి, తెలంగాణ జర్నలిజం ఎలా ఉండాలో చెప్పడానికి, ఆంధ్ర యాజమాన్యంలోని మీడియాలో తెలంగాణ జర్నలిస్టులు అనుభవిస్తున్న వేదనను చాటి చెప్పడానికి తెలంగాణ జర్నలిస్టు ఫోరం మే 31 అనే పుస్తకాన్ని తెచ్చింది. ఆ సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన జర్నలిస్టులకు ఆంధ్ర మీడియాలో ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పనిచేయడానికి ఉన్న వ్యవస్థల్లో అవకాశం చిక్కడం లేదు. నమస్తే తెలంగాణ దినపత్రిక తమకు మార్గం చూపుతుందని చాలా మంది భావించారు. కానీ, ఈ రోజు ఆ సంస్థలో తెలంగాణ కోసం పనిచేసిన జర్నలిస్టులు అనుభవిస్తున్న వేదన అంతా ఇంతా కాదు. ఆ పుస్తకానికి, తెలంగాణ జర్నస్టు ఫోరానికి ప్రాణం పోసిన ఓ జర్నలిస్టుల్లో ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

అవార్డులు కూడా....

అవార్డులు కూడా....

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇచ్చే రాష్ట్ర అవార్డులు తెలంగాణ కోసం పనిచేయనివారికి కూడా వస్తున్నాయి. తెలంగాణవారే అయినప్పటికీ తెలంగాణ కోసం పనిచేయనివారికి ఆ అవార్డులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. అది ఆహ్వానించదగిందే కావచ్చు, మనవారిని మనం గౌరవించకోవడమేనని తెలంగాణవాదులు చాలా మంది సరిపెట్టుకుని ఉండవచ్చు. కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసినవారికి అవి అందడం లేదు. అందుకు కారణాలున్నాయి. కొంత మందిని తప్పు పట్టడానికి కూడా అవకాశాలున్నాయి. కానీ, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నిబద్ధత, నిజాయితీ ఉన్నవారికి సరైన స్థానాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.

తెలుగు మహాసభలు వాయిదా...

తెలుగు మహాసభలు వాయిదా...

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ప్రారంభించి నడిపించాలని తొలుత కెసిఆర్ నిర్ణయించారు. కానీ వాటిని వాయిదా వేశారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రకటన వెలువడగానే పలు వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల్లో ప్రధానమైంది ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాల్సిన అవసరం ఏమిటనేది, అవి ఎందుకు నిర్వహిస్తున్నారనేది. అయితే, శకునం కలిసి రాకపోవడంతో వాటిని కెసిఆర్ వాయిదా వేశారు. జూన్ 2వ తేదీ అష్టమి కాబట్టి వాటిని వాయిదా వేశారని తెలుస్తోంది. వాటిని అక్టోబర్‌లో నిర్వహిస్తారని చెబుతున్నారు. దీనిపై పెద్దగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు గానీ తెలుగు మహాసభల నిర్వహణ పట్ల వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అనేది ప్రశ్న.

ఆంధ్ర ఆధిపత్య పునరుద్ధరణ?

ఆంధ్ర ఆధిపత్య పునరుద్ధరణ?

కళా సాంస్కృతిక రంగాల్లో తిరిగి ఆంధ్ర ఆధిపత్య పునరుద్ధరణ జరుగుతుందనే అనుమానాలు తెలంగాణవారి వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి. మంటలకు ఆహుతి అయిన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని కెసిఆర్ సందర్సించడం అందుకు ప్రధానమైన సంకేతంగా భావిస్తున్నారు. సాహిత్య, కళారంగాల్లో కూడా అది కనిపిస్తూనే ఉంది. ఆ మీడియాకు వ్యతిరేకంగా పోరాడిన కళాకారులు, రచయితులు, కవుల మనోభావాలు దెబ్బ తీసిన సంఘటనగా దాన్ని భావిస్తున్నారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయినా సరే, తెలంగాణ సినిమా రంగానికి ఒరిగిందేమీ లేదు. తెలంగాణవారికి అప్పటి కన్నా ఎక్కువ అవకాశాలు వస్తున్న దాఖలాలు ఏవీ కనిపించడం లేదు. పావలా శ్యామలను కెసిఆర్ ఆదరించడాన్ని అందరూ హర్షించారు. కానీ తెలంగాణలోని పలువురు సినీ కళాకారులు ఇప్పటికీ దుర్భరమైన పరిస్తితిలోనే ఉన్నారు. అటువంటివారిని గుర్తించే పని ఏదీ జరిగినట్లు లేదు.

ఆంధ్ర సినిమావాళ్లకే...

ఆంధ్ర సినిమావాళ్లకే...

ఆంధ్ర ప్రాంతానికి చెందిన అక్కినేని నాగార్జునకు కాబోయే కోడలు సమంతను తెలంగాణ చేనేత అంబాసిడర్‌గా నియమించడం, పవన్ కల్యాణ్‌తో కలిసి కెసిఆర్ తనయుడు, మంత్రి కెటి రామారావు కాటమరాయుడు సినిమాను చూడడం వంటి పనులు ఆంధ్ర ఆధిపత్యమే యధావిధిగా కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తోంది. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదేమో గానీ తెలంగాణ వారి పట్ల దృక్పథం ఏలా ఉందనేదే ప్రశ్న. తెలంగాణ సినిమా ప్రత్యేక రూపుదిద్దుకోవడానికి అవసరమైన కృషి ఏదీ జరగకపోవడమే ఆ ఆ ప్రశ్న ఉదయించడానికి కారణం.

English summary
Questions are raised on the Telangana CM K Chandrasekhar Rao's cultural policy in reconstructing Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X