పల్లా సీటు గల్లంతేనా? జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో పొన్నాల?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన తరువాత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే పార్టీలలో జంపింగ్ జపాంగ్ లు పెరిగిపోతున్నారు. వివిధ పార్టీలలో కీలక నేతలు ఊహించని విధంగా అధినాయకత్వానికి షాక్ ఇస్తూ పక్క పార్టీల పంచన చేరుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కు లేఖను పంపించారు పొన్నాల లక్ష్మయ్య. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఆయన తీవ్ర అసహనానికి గురై రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.

పొన్నాల లక్ష్మయ్య తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అమ్మకానికి పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలోనే తమను పరాయి వాళ్ల లాగ చూస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.
ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. సర్వేల పేరుతో సీట్లను ఇవ్వకుండా కుట్రలు జరుగుతున్నాయి అంటూ మండిపడ్డారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఆయన జనగామ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో ఉంటారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే జనగామ నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని కేటీఆర్ ప్రకటించినప్పటికీ, అధికారికంగా అభ్యర్థిని ప్రకటించని నేపథ్యంలో నిర్ణయం మారే అవకాశం కనిపిస్తుంది.
సీనియర్ బీసీ నాయకుడైన పొన్నాల లక్ష్మయ్యకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా సమాచారం. దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్న ఆయన పొన్నాల లక్ష్మయ్యను జనగామ బరిలోకి దింపి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలనుకుంటున్నారు అని ప్రగతి భవన్ వర్గాల భోగట్టా.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications