• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిగ్గుందా.?చేనేత రంగానికి బీజేపి ఏంచేసింది.?మరొక్కసారి కడిగేసిన హరీష్ రావు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్య మాటల వార్ నడుస్తోంది. కిషన్ రెడ్డి ని సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పాలని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరుపున చేనేత రంగానికి, చేనేత కార్మికులకు ఏం చేసిందని హరీష్ రావు నిలదీసారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలన్నారు. చేనేత రంగం మీద ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం హామీ ఇచ్చారని, నల్లగొండ జిల్లా బోధన్, పోచంపల్లి, సిరిసిల్లల్లో అనాడు ఆత్మ హత్యలకు పాల్పడిన కుటుంబాలకు యాబై లక్షలు అందించామన్నారు హరీష్ రావు.

చేనేతకు కేంద్రం ఏంచేసింది..?

చేనేతకు కేంద్రం ఏంచేసింది..?

చేనేత రంగం కార్మికులకు ప్రభుత్వం తరుపున అనేక రకాల చేయూతను ప్రభుత్వం అందిస్తుందని, 350కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ చీరల ఆర్డర్ ను చేనేత కార్మికులకు ఇచ్చామన్నారు హరీష్. నేతన్నలు భీమా, మర మగ్గాలకు సబ్సిడి లాంటి అవకాశాలు కొనసాగిస్తున్నామన్నారు.

కొండ లక్ష్మన్ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మాడల్ అని, అప్పటి పాలకులు కొండ లక్ష్మన్ బాపూజీని అవమానిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పించామన్నారు. 1250ఎకరాల్లో మెగా టెక్స్ట్ టైల్ పార్క్ వరంగల్ లో ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు గుర్తు చేసారు.

బీజేపి రద్దు చేసే పార్టీ..

బీజేపి రద్దు చేసే పార్టీ..

ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేతన్న కార్మికులకు ఇక్కడే మెరుగైన జీవనోపాది కల్పించేలా బరోసా ఇచ్చామన్నారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లూమ్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, 2014లో తీసుకొచ్చిన త్రీఫ్ట్స్ ఫండ్ పథకం కూడా రద్దు చేసిందని బీజేపీపై హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చేనేత కార్మికులకు రోడ్డున పడేసిందని, చేనేత కార్మికుల మీద పరోక్షంగా భారం వేసిందన్నారు.

దీనివల్ల నూలు దొరకకుండా ఇబ్బందులకు గురి చేసిందని, రోజూ తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి సహాయం చేయకుండ వెళ్లిపోతున్నారని మంత్రి ఎద్దేవా చేసారు.

మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు..

మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు..

మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కు ఒక్క రూపాయి సహాయం అందించలేదని, రద్దు లన్ని కేంద్రానికి వర్తిస్తే పద్దులు అన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. కొండ లక్ష్మన్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. నేతన్న భీమా కింద ఐదు లక్షలు సహాయం అందిస్తున్నామని, ఎల్ఐసి, రైల్వే, రైల్వే స్టేషన్ లను అమ్మిన ఘనత బీజేపిదని, మేకిన్ ఇండియా ద్వారా ఏమీ చేయకపోగా జాతీయ జెండాలను చైనా నుండి తెచ్చారని అన్నారు. మేకిన్ ఇండియా లక్ష్యం ఏంటని ప్రశ్నించారు.

 గొప్ప అవకాశం కల్పించారు..

గొప్ప అవకాశం కల్పించారు..

ఈ సందర్బంగా చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చింత ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి హరీష్ రావు. చేనేత పట్ల ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి సీఎం చంద్రశేఖర్ రావు అని చింత ప్రభాకర్ తెలిపారు. గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రశేఖర్ రావుకి, మంత్రులు కేటీఆర్కి, హరీశ్ రావుకి కృతజ్ఞతలు చింత ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. చేనేత సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని, తనను నమ్మి అవకాశం కల్పించారని, సీఎం పేరు నిలబెట్టెలా పని చేస్తానని చింత ప్రభాకర్ స్పష్టం చేసారు.

English summary
A war of words is going on between Telangana Finance and Medical Health Minister Harish Rao and Union Minister Kishan Reddy. We are directly asking Kishan Reddy to give an answer, Harish Rao denied that what has been done to the handloom industry and the handloom workers by the central government of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X