Weather Report: తెలంగాణకు చల్లని వార్త.. రెండు రోజులు వర్షాలు పడే అవకాశం..!
ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భంగా మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణఇ ఆవరించి ఉందని పేర్కొంది. దీని ఫలితంగా దక్షిణ తెలంగాణలో అక్కకడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గత కొద్ది రోజులగా మండే ఎండలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారు. కొన్ని భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నల్గొండలో గరిష్ఠంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్‌లో కనిష్ఠంగా 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రెండు రోజలు వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయని పేర్కొంది.
ఈ ప్రభావంతో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాలోని జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఏపీలోన పలు ప్రాంతాల్లో వర్షం పడింది. శ్రీకాకుళం, పల్నాడు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వాన పడింది.












Click it and Unblock the Notifications