నయీం కేసులో మరో మలుపు: భార్యకు ఐటీ నోటీసులు
గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు.నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించరు.బినామీ ఆస్తులపై అక్టోబర్ 3లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు.
భువనగిరి: గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు. నయీం ఇంటికి ఐటీ అధికారులు నోటీసులు అంటించరు.
బినామీ ఆస్తులపై అక్టోబర్ 3లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు పంపించింది.

తల్లి తహేహా బేగం, సోదరి సలీమా బేగం, హుసేనా బేగం, అహేళ బేగం, హీనా కౌసర్ పేర్లతో నోటీసులు జారీ చేశారు. భువనగిరి పరిసర ప్రాంతాలు, యాదగిరిగుట్ట, ఔషాపూర్, కీసర, కుందన్‌పల్లి, హైదరాబాద్ భూములపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications