ఎన్నికల వేళ ఐటీ కలకలం - కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో సోదాలు..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న నేత ఇళ్లు..కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ..ఐటీ దాడులు సంచలనంగా మారాయి. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారితో పాటుగా అభ్యర్దుల ఇళ్లు..కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఎల్‌ఆర్‌ నివాసంతో పాటుగా ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూను దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అదే నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతల ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి.

IT Raids on Congress Contesting Candidate KLR Office and Residence in Hyderabad ahead Elections

కేఎల్ఆర్ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు. అదే విధంగా..బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ ఆశావహురాలు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఇంటికి చేరుకుని పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాతానర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పారిజాతానర్సింహారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి కోట్లలో డబ్బులు ముట్టజెప్పారని ఆరోపించారు.

ఇక, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఐటీ దాడులు కొత్త టెన్షన్ కు కారణం అవుతున్నాయి. అటు ఎన్నికల విధుల్లో భాగంగా అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. లెక్క లేని నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరగటాన్ని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణలోనే ప్రచారం చేస్తున్నారు. ఈ ఐటీ దాడుల వ్యవహారం పైన స్పందించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+