సవాల్:రాత్రి 1.48 గంటల తర్వాత శిరీష బతికుందనే ఆధారాలు చూపగలరా?
బ్యూటీషీయన్ శిరీషను హత్య చేశారని భర్త సతీష్ చంద్ర ఆరోపించారు. శిరీష ఆత్మహత్య చేసుకొనేంత పిరికిదికాదన్నారు.ఆమెను చంపేసిన తర్వాతే స్టూడియోకు తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శిరీష ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని శిరీష భర్త సతీష్ చంద్ర అభిప్రాయపడ్డారు.ఆమెను చంపేసిన తర్వాతే స్టూడియోలోకి తీసుకొచ్చారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య, కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల కేసులకు సంబంధించి కుటుంబసభ్యులు మొదటినుండి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఆయన మరోసారి పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబట్టారు. ఆమెను హత్య చేశారని ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.
అయితే పోలీసులు చేస్తున్న వాదనల్లో వాస్తవాలు లేవని ఈ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు అభిప్రాయపడుతున్నారు. శిరీష ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేస్తామని కూడ బంజారాహిల్స్ ప్రకటించారు.
బంజారాహిల్స్ పోలీసులు ప్రకటించిన తర్వాత కూడ బ్యూటీషీయన్ భర్త సతీష్ చంద్ర ఇదే రమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆమెను చంపిన తర్వాతే హైద్రాబాద్ కు తీసుకువచ్చారని ఆయన అభిప్రాయపడుతున్నారు.

శిరీషది హత్యే
బ్యూటీషీయన్ శిరీషది హత్యేనని ఆమె భర్త సతీష్ చంద్ర అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులు చెబుతున్న విషయాలతో ఆయన విబేధించారు. ఆమెను ఆత్మహత్య చేసుకొనేంత పిరికికాదన్నారు. అయితే ఆమెను చంపేసిన తర్వాతే స్టూడియోకు తీసుకువచ్చి ఉంటారని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఆపద ఉందనే వాట్సాప్ ద్వారా లోకేషన్ షేర్ చేసింది
ఆపదలో ఉన్నందునే బ్యూటీషీయన్ శిరీష తనకు తాను ఎక్కడుందో తెలిపేందుకు ప్రయత్నించిందనే అనుమానాన్ని సతీష్ చంద్ర వ్యక్తం చేశారు. రాత్రిపూట వాట్సాప్ ద్వారా తాను ఉన్న లోకేషన్ ను షేర్ చేసిన తర్వాత శిరీష బతికి ఉందని పోలీసులు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.రాత్రి 1.40 నిమిషాల తర్వాత శిరీషను చంపేసి ఉంటారని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

సీసీటివి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్, ఆర్ జె స్టూడియో వద్ద ఉన్న సిసిటివి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సిసిటివి కెమెరాలు పనిచేస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయమై వెలుగుచూడాల్సిన వాస్తవాలు ఇంకా ఉన్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనలు జరిగిన ఈ రెండు చోట్ల సిసి కెమెరాలు పనిచేయకపోవడం యాధృఛ్చికంగా జరిగిందా , ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా అనే అనుమానాలను కూడ ఆయన వ్యక్తం చేశారు.

శిరీష క్యారెక్టర్ పై ఎందుకు ఫోకస్ చేశారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వాస్తవాలను చెప్పకుండా బ్యూటీషీయన్ శిరీష క్యారెక్టర్ పైనే ఎందుకు పోకస్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. శిరీషపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు వాస్తవాలను మరుగునపర్చే ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రవణ్ ల నుండి వాస్తవాలను ఎందుకు రాబట్టలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications