తెలంగాణలో అధికారం దక్కేదెవరికి - తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు..!!
తెలంగాణలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. తమదే విజయమని బీజేపీ ధీమాగా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ తమకే ప్రజలు ఈ సారి పట్టం కడతారంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సమయంలో అసలు గెలిచేదెవరనే దాని పైన అనేక సర్వే సంస్థలు ముందుకు వచ్చాయి. ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్కుడు తెలంగాణలో గెలుపు ఎవరిదో తేల్చి చెప్పారు. గతంలో కర్ణాటక ఫలితాల్లో ఆయన జోస్యం ఫలించింది.
Namo Rudraya🙏🏻 In the upcoming Telangana elections, The reigning government of Shri. K. Chandrashekhar Rao will be re-elected & continue its tenure in Telangana.
— Rudrá Karan Pártaap🇮🇳 (@Karanpartap01) May 27, 2023
తెలంగాణలో గెలిచేదెవరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. ఈ ఏడాది తెలంగాణ మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. ఈ సమయంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు తెలంగాణ ఫలితాల పైన తన అంచనాలను స్పష్టం చేసారు. చండీగఢ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ ఫేమ్ అయ్యారు. కర్ణాటక లో కాంగ్రెస్ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పారు. అందునా కాంగ్రెస్ కు 123 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు.. ఆయన అంచనాలు నిజమవుతూ కాంగ్రెస్ కు 135 సీట్లు దక్కాయి. ఇప్పుడు ఇదే జ్యోతిష్కుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ దే గెలుపు
తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఈ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ తేల్చి చెప్పారు. ''నమో రుద్రాయ.. రానున్న తెలంగాణా ఎన్నికలలో కె చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే మళ్లీ ఎన్నికై.. తన పదవీకాలాన్ని కొనసాగిస్తుంది..'' అంటూ రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మే నెల అనుకూలంగా లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కు గ్రహస్థితి అనుకూలంగా ఉందని యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఫలితాల తరువాత కూడా ఈ జ్యోతిష్కుడు చెప్పినది నిజమైందంటూ ట్వీట్లు కనిపించాయి. గతంలో చెప్పిన సీట్ల సంఖ్య..ఫలితాలను కలిపి ట్వీట్లు చేసారు. ఇప్పుడు తెలంగాణ ఫలితాల పైన ఇదే జ్యోతిష్కుడు చెబుతున్న అంచనాలపైన ఆసక్తి పెరుగుతోంది.

రాజకీయ చర్చ
రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ అభిమానులు దీనీని సర్క్యులేట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. సిట్టింగ్ లో ఆరోపణలు వస్తే మినహా మిగిలిన వారికి సీట్లు ఖాయమని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు అంచనాల పైన బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు విభేదిస్తున్నాయి. బీఆర్ఎస్ గెలుస్తందంటూ వెల్లడించిన అంచనాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications