చేవెళ్ల మాజీ ఎంపీ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు..!
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 24 గంటలకు పైగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలానే మరో ఆరు కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ విస్తృత స్థాయిలో తనిఖీ చేస్తోంది.
డీఎస్ఆర్ గ్రూప్‌పై ఐటీ అధికారులు ఫోకస్..
ప్రధానంగా డీఎస్ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కంపెనీల ఆఫీసులు, ప్రాజెక్ట్ సైట్లు, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్ళలోనూ విస్తృతంగా సోదాలు జరిగాయి.

రంజిత్ రెడ్డి ఇంట్లో రెండ్రోజులుగా సోదాలు..
రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అందువల్ల ఆయన ఇల్లు ప్రధాన టార్గెట్‌గా మారింది. నిన్న తెల్లవారుజామునే నాలుగు ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకూ తనిఖీలు జరగగా.. ప్రస్తుతం కూడా ఒక బృందం ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది.
నగదు, పత్రాలు, లాకర్లు స్వాధీనం..
ఈ తనిఖీల్లో అధికారులు భారీ మొత్తంలో నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతలు, రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. వీటిని నేడు తెరవనున్నట్లు సమాచారం. డీఎస్ఆర్ గ్రూప్ చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అనధికారిక నగదు లావాదేవీలు జరిగాయనే అనుమానాలపై ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ తో లింక్..
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో లింక్ ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్‌ఫ్రా కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూప్‌తో పాటు మరికొన్ని కంపెనీలతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించాయని టాక్. అయితే ఈ దాడుల వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ దిశగా కొత్త ఆధారాలు బయటపడే అవకాశముందని ఐటీ శాఖ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications