హైదరాబాద్ పిస్తా హౌస్, మెహఫిల్ రెస్టారెంట్లకు షాక్.. !!

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బిర్యాని రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు సాగిస్తోంది. మొత్తం మూడు గ్రూప్ లకు చెందిన చైన్ రెస్టారెంట్లల్లో ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన మొత్తం ఎనిమిది టీమ్ లు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. కోట్ల రూపాయల అమ్మకాలకు సంబంధించిన పన్ను ఎగవేత జరిగిందని అనుమానంతో ఆదాయపు పన్ను శాఖ పరిశోధనా విభాగం మంగళవారం ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇందులో పిస్తా హౌస్, షా గౌస్, మెహఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కు చెందిన కార్యాలయాలు, నివాసాలు ఉన్నాయి. ఐటీ బృందాలు ఏకకాలంలో ఈ దాడులు చేపట్టాయి.

IT Sleuths Raid Major Biryani Chain Restaurants in Hyderabad

హైదరాబాద్ లో మొత్తం 30 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మూడు బ్రాండ్లకు సంబంధించిన అనేక చోట్ల ఈ ఆపరేషన్లు జరిగాయని అధికారులు తెలిపారు. 2006లో ప్రారంభమైన మెహఫిల్ గ్రూప్.. ప్రస్తుతం హైదరాబాద్‌ అంతటా 15 బ్రాంచ్ లను నడుపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా దీనికి బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్ చైన్ ఈ ఏడాదిలో కూడా కొత్త అవుట్‌లెట్లను తెరిచింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది.

పిస్తా హౌస్ పై కూడా ఇవే తరహా ఆరోపణలు ఉన్నాయి. 1997లో మహ్మద్ అబ్దుల్ మజీద్ దీన్ని స్థాపించారు. బిర్యానీ, హలీమ్ కు ఫేమస్ రెస్టారెంట్ ఇది. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది. దేశంలో పలు రాష్ట్రాల్లో పిస్తాహౌస్ రెస్టారెంట్లు ఉన్నాయి. అమెరికా, యూఏఈ, ఒమన్, కువైట్‌లలో కలిపి 44 స్టోర్లు కార్యకలాపాలు సాగిస్తోన్నాయి. దీని ప్రధాన కార్యాలయం పాతబస్తీ షాలిబండలో ఉంది. డైరెక్ట్ సేల్స్ తో పాటు ఆన్‌లైన్ ఆర్డర్లు, ఫ్రాంచైజీల ద్వారా కోట్ల రూపాయల మేర వ్యాపారం సాగిస్తోంది పిస్తా హౌస్.

ప్రత్యేకించి హలీమ్ సీజన్‌లో అమ్మకాలు కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. షా ఘౌస్ రెస్టారెంట్‌పై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ సహా పలు ప్రాంతాల నుండి ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఫుడ్-అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా దీనికి మంచి ఉనికి ఉందని అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో ఆర్థిక రికార్డులు, శాఖల వారీ లావాదేవీలు, ఇతర పత్రాలను పరిశీలించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+