మీ దారి సరైనది కాదు: కేసీఆర్‌పై కోదండరాం, దేవేందర్ గౌడ్ లేఖ
తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుస్తున్న దారి సరైంది కాదన్నారు.
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుస్తున్న దారి సరైంది కాదన్నారు. ప్రభుత్వం చేప్పే మార్గంలో అభివృద్ధి సాధ్యం కాదన్నారు.
నిజాం షుగర్స్ కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరన్న ప్రభుత్వ వాదన తప్పన్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ పైన త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు.
అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ల మీద సుధీర్ కమిటీ సిఫారసులపై సదస్సును త్వరలోనే నిర్వహిస్తామని కోదండరాం చెప్పారు. దీంతోపాటుగా విద్యార్థి సమస్యలపై విద్యాయాత్ర చేస్తామన్నారు.

దేవేందర్ గౌడ్ లేఖ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎంపీ దేవేందర్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, అధికారుల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాల్లో అధికార యంత్రాంగం కూడా ఏర్పడలేదని, ప్రజా ప్రతినిధుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఈ పరిస్థితి ఆటంకంగా మారిందన్నారు.












Click it and Unblock the Notifications