స్కూళ్లు మూసేయం: జగదీశ్వర్, ఏకేసిన పొన్నాల

ఆరో నంబర్ ఉత్తర్వులో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాఠశాలలు మూసివేయమని చెప్పారు. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికేట్లు లేకుండా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. టీచర్లకు మాత్రమే రేషనలైజేషన్ అని, పాఠశాలలకు లేదన్నారు.
రేషనలైజేషన్ జీవోలో కొన్ని మార్పులు ఉంటాయని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్లు లేకుండా అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. గత 30 ఏళ్లుగా జారీ అయిన సర్టిఫికేట్లు ఆన్ లైన్లో పెడతామని తెలిపారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో మరోమారు సమావేశం అవుతామని, వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఐటీ నిపుణులు, పోలీసు అధికారులు హాజరవుతారన్నారు.
కేసీఆర్‌పై పొన్నాల ఆగ్రహం
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోకుంటే ప్రజలు తిరగబటే సమయం వస్తుందని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లాలో హెచ్చరించారు. జిల్లాలో కాంగ్రెసు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కొత్త రాష్ట్రంలో మంచి జరుగుతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తుంటే, వంద రోజులు దాటినా ప్రభుత్ం ఏం చేయలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు 3 లక్షల కోటల రూపాయల హామీలు ప్రకటించారని, ఇందులో ఏదీ అమలు కాలేదన్నారు.
కేసీఆర్ ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలు పట్టించుకోకండా హేళన చేయడం సరికాదన్నారు. వాటర్ గ్రిడ్, చెరువులు, కుంటలు పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తున్నారని, రుణమాఫీ విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారన్నారు. మరో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ కూడా కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications