జగన్ కేసీఆర్ ల భేటీలో ఆసక్తికర చర్చ .. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని జగన్ కు చెప్పిన కేసీఆర్

Recommended Video

    జగన్ హితబోధ చేశారట కేసీఆర్ || Jagan And KCR Interesting Discussion To Avoid Defections Into BJP

    ఏపీ సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ ల తాజా భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. నిన్నటికి నిన్న ప్రగతిభవన్ కి వెళ్లిన జగన్, కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టులు, విభజన సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీ భవన్ విభజన, ఉద్యోగుల బదిలీలపైన కూడా చర్చించారు జగన్. ఇక సీఎం కేసీఆర్ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో త్వరలో చేపట్టనున్న యాగం విశేషాలను జగన్‌తో పంచుకున్నారు. అంతేకాదు ఒక ఆసక్తికర విషయాన్ని కెసిఆర్ జగన్ కు చెప్పారని సమాచారం. దాదాపు ఇరవై నిమిషాలు వారు ఆ అంశంపై మాట్లాడుకున్నారని తెలుస్తుంది.

    తెలుగురాష్ట్రాల్లో బీజేపీ తీరుపై కేసీఆర్ , జగన్ ల మధ్య చర్చ

    తెలుగురాష్ట్రాల్లో బీజేపీ తీరుపై కేసీఆర్ , జగన్ ల మధ్య చర్చ


    ఇంతకీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్ లు అంతసేపు చర్చ జరిపిన అంశం ఏమిటో తెలుసా .. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల గురించి అందునా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పట్టు సాధించడం కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి కెసిఆర్ జగన్ తో మాట్లాడారని తెలుస్తుంది . చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని ఏపీ సీఎం జగన్ కు చెప్పారట కేసీఆర్.
    అంతే కాదు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఏ పార్టీలో ఉన్న నేతలైనా సరే కీలక నేతలని భావించినప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లకుండా చూసుకోవాలనిజగన్ కు సలహా ఇచ్చారట కేసీఆర్. బిజెపిలోకి వలసలను అరికట్టకుంటే భవిష్యత్తులో అది వైసిపి కి తలనొప్పిగా మారే ప్రమాదముందని హితబోధ చేశారట కేసీఆర్ .

    బీజేపీలోకి వలసలను అడ్డుకోవాలని జగన్ కు సూచించిన కేసీఆర్ ..

    బీజేపీలోకి వలసలను అడ్డుకోవాలని జగన్ కు సూచించిన కేసీఆర్ ..

    ఇక తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి తాను అనుసరిస్తున్న వ్యూహాన్ని జగన్ కూడా అనుసరిస్తే బావుంటుందని సలహా ఇచ్చారని సమాచారం. తెలుగుదేశం అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీలోని నేతలు చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారని మాట్లాడిన కేసీఆర్ ఇక వారు బిజెపి లోకి వెళ్లకుండా వైఎస్సార్సీపీలోకి చేర్చుకోవాలని కేసీఆర్ సూచించారట.

    రెండు తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికీ రెండు రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా అవతరించాలని ప్రయత్నాలు చేస్తుంది.

     జగన్ పట్టించుకోకుంటే పెను ప్రమాదం అని అపర చాణిక్యం బోధించిన కేసీఆర్ .. పార్టీలో గుసగుసలు

    జగన్ పట్టించుకోకుంటే పెను ప్రమాదం అని అపర చాణిక్యం బోధించిన కేసీఆర్ .. పార్టీలో గుసగుసలు

    తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీ లకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బిజెపిని తీర్చిదిద్దాలని ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఏపీలో వలసలు బిజెపిలోకి ఎక్కువగా కొనసాగుతున్నాయని భావించిన సీఎం కేసీఆర్ ఆ ఛాన్స్ బిజెపికి ఇవ్వద్దని జగన్ కు చెబుతున్నారట. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బిజెపి బలపడడానికి ఏ కొంచెం ఛాన్స్ ఇచ్చిన అది తర్వాత తమకే చేటు చేస్తుందని కెసిఆర్ జగన్ కు అపర చాణిక్యం బోధించారని సమాచారం .. ఏది ఏమైనా బిజెపిని తాను లెక్కలోకి తీసుకోవడం లేదని చెబుతూనే సీఎం కేసీఆర్ బిజెపికి బాగానే భయపడుతున్నారు. అందుకే దాదాపు 20 నిమిషాల పాటు ఏపీలో బీజేపీని బలోపేతం కానివ్వొద్దు అంటూ జగన్ కు హితోపదేశం చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+