జగన్‌కు బోనాలతో స్వాగతం, రోజా ఆగ్రహం: టిఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుపై ఈసికి రేవంత్ లేఖ

వరంగల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరంగల్ జిల్లా పాలకుర్తిలో సోమవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. వరంగల్ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున జగన్ ప్రచారం చేస్తున్నారు.

జగన్ ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరారు. లోకసభ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు రోజుల పాటు ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తారు. సోమవారం సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

జగన్‌కు పాలకుర్తిలో మహిళలు బోనాలతో తరలి వచ్చి స్వాగతం పలికారు. ఆయన పాలకుర్తిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. జగన్ వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Jagan and Roja campaign in Warangal bypolls

ప్రజలు రాజన్న రాజ్యం కోసం చూస్తున్నారు

తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోసం చూస్తున్నారని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలనేపథ్యంలో ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. వైసిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఉప ఎన్నికల వల్ల ప్రజలపై భారం: రోజా

కెసిఆర్ ప్రభుత్వానిది మాటలేనని, చేతలు మాత్రం లేవని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదివారం అన్నారు. వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఆమె రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్ మాటలు విని ప్రజలు ఓట్లేసిగెలిపిస్తే 17 నెలలుగా ప్రజలకు ఏం చేయలేదన్నారు.

కెసిఆర్ అహంకార ధోరణితో ఉప ఎన్నిక వచ్చిందన్నరాు. కెసిఆర్ తన చెప్పుచేతల్లో ఉండే వారిని మంత్రులుగా చేశారని, దళిత ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్ చేశారని ఆరోపించారు. ఆ పదవిని కడియం శ్రీహరికి ఇచ్చి ఉప ఎన్నికలకు తెర తీశారన్నారు.

ఈ ఉప ఎన్నికల వల్ల ప్రజలకు రూపాయి ఉపయోగం లేకపోగా, పన్నుల రూపంలో భారం పడుతుందన్నారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు ప్రజలపై భారం మోపి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్న కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. కెసిఆర్ అధికారంలోకి రాగానే ఎంటెక్ విద్యార్థిని శృతిని చిత్రహింసలకు గురి చేసి చంపారన్నారు.

ఈసీకి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం ఎన్నికల కమిషన్‌కు (ఈసీ) లేఖ రాశారు. నమస్తే తెలంగాణ, టీన్యూస్‌లలో వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు సంబంధించిన వార్తలను
పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలంటూ లేఖలో కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చు ఇప్పటికే పరిధి దాటిందన్నారు. ఈ క్రమంలో పసునూరిని అనర్హుడిగా ప్రకటించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+