పూరీ జగన్నాథుడి రథయాత్ర: సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల జాతర
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర గడువు సమీపిస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ రథయాత్రను విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ చురుగ్గా ఏర్పాటు పూర్తి చేస్తోంది. నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోనున్నారు. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలను తీసుకుంటోంది.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథుడిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్నాథుడితో పాటు బలరాముడు, సుభద్రలను వేర్వేరు రథాల మీద కన్నుల పండువగా పూరీ నగరంలో ఊరేగిస్తారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా భావిస్తారు. ఉత్సవ మూర్తులకు భిన్నంగా సాక్షాత్ గర్భగుడిలో ఉండే స్వామివార్లనే ఊరేగించడం దీని ప్రత్యేకత.

పూరీ జగన్నాథుడి రథయాత్రను కనులారా వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాదిమంది పూరీ జగన్నాథుడిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు.
ఈ నెల 20వ తేదీన జరిగే ఈ రథోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆయా రైళ్లన్నీ పూరీకి బయలుదేరి వెళ్తాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో కూడిన ఓ ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
సికింద్రాబాద్ నుంచి శనివారం రాత్రి 9:05 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07058 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం పూరీ సమీపంలోని మాలతిపత్‌పూర్‌కు చేరుకుంటుంది. పగిడిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, కృష్ణా కెనాల్ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగం, శ్రీకాకుళం, పలాస, బరంపురం, ఖుర్దారోడ్ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2:20 నిమిషాలకు నాందెడ్ నుంచి బయలుదేరే నంబర్ 17063 రైలు మరుసటి రోజు రాత్రి ఖుర్దా రోడ్ జంక్షన్‌కు చేరకుంటుంది. ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, పగిడిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, కృష్ణా కెనాల్ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగం, శ్రీకాకుళం, పలాస, బరంపురం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
ఈ నెల 21వ తేదీన రాత్రి 8:30 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07090 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు రాత్రి ఖుర్దారోడ్ జంక్షన్‌కు చేరుకుంటుంది. కాచిగూడ, మల్కాజ్‌గిరి, మౌలాలి గేట్, పగిడిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, కృష్ణా కెనాల్ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగం, శ్రీకాకుళం, పలాస, బరంపురం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications