వీడిన మిస్టరీ: ప్రియుడి చనిపోయాడని ఒకామె.. ఆమె కోసం...
సంగారెడ్డి: మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం కొండపోచమ్మ ఆలయ సమీపంలోని గుట్టల్లో గుర్తు తెలియని ఇద్దరు బాలికల శవాల మిస్టరీ వీడింది. వారు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారని నిర్ధారణ జరిగింది. వారిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు. ఆ విషయాలను జగదేవపూర్ ఎస్సై వీరన్న వివరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్దకు చెందిన బూడిద మంజుల (15), బాలనగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పుజారి శిరీష మంచి మిత్రులు. వారిద్దరు మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివేవారు ఇందులో మంజుల అదే ప్రాంతానికి ఓ యువకుడిని ప్రేమించింది. అయితే అతను ప్రమాదవశాత్తు మరణించాడు.
ప్రియుడి మరణాన్ని తట్టుకోలేకు తాను ఆత్మహత్య చేసుకుంటానని మంజుల శిరీషకు చెప్పింది. ఆమెను వారించడదానికి శిరీష, ఆమె తల్లి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష రాసిన తర్వాత నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అక్కడి నుంచి వారు కొండపోచమ్మ ఆలయానికి చేరుకుని కొండపోచమ్మ ఆలయం వద్ద ఉన్నామని శిరీష తల్లికి ఫోన్‌లో చెప్పింది.

మీ ఆచూకీ తెలియక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని వారికి తెలిపారు. వెంటనే ఫోన్ కట్టయింది. తర్వాత ఇద్దరూ కలసి ఒకరి చున్నీతో మరొకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలు సోమవారం గుట్టలో కనిపించడదం, విషయం పత్రికల్లో రావడంతో వారి తల్లితండ్రులు మంగళవారం జగదేవపూర్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
మరణించిన బాలికలిద్దరు కూుడా తమకు సంబంధించిన వారే అని చెప్పారు. మంగళవారం రాత్రి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై వీరన్న తెలిపారు. ఓ బాలిక శవం చెట్టుకు వేలాడుతూ మరో బాలిక శవం సమీపంలో కింద పడి కనిపించాయి.












Click it and Unblock the Notifications