పీసీసీ చీఫ్ ఎంపికపై జగ్గారెడ్డి స్పందన: మనుసులో మాట బయటపెట్టారు!
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని మహేశ్ కుమార్ గౌడ్‌కు కట్టబెట్టడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. టీపీసీసీ చీఫ్ పదవిని బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు. తాను కూడా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతేగాక, ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతానని వ్యాఖ్యానించారు.
శనివారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. పీసీసీ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కొత్త పీసీసీ చీఫ్ పార్టీలో అందరినీ కలుపుకుని పోతారని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పీసీసీ చీఫ్ పదవిని బీసీ నేతకు ఇచ్చారన్నారు. తాను కూడా ఏదో ఒకరోజు పీసీసీ చీఫ్ అవుతానని జగ్గారెడ్డి చెప్పారు. రెడ్డి సీఎం.. ఎస్సీ డిప్యూటీ సీఎం.. పీసీసీ బీసీ.. ఇలా మూడు ప్రదాన పదవుల్లో మూడు కులాలకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధిష్టానం పీసీసీ ఇచ్చిందని.. భవిష్యత్తులో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే తాను ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఫ్రీడం ఉంటుందన్నారు. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమేనని అన్నారు. ఎవరికి వస్తుందో.. ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని.. అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఉండదన్నారు.
మహేశ్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పీసీసీ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ గొప్పతనమని చెప్పారు. బీసీ కమిషన్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ ఇచ్చారన్నారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని చెప్పారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications