నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'

రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం భారతీయ జనతా పార్టీలో పరిస్థితులు మారాయా? ప్రధాని నరేంద్ర మోడీని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం భారతీయ జనతా పార్టీలో పరిస్థితులు మారాయా? ప్రధాని నరేంద్ర మోడీని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత బీజేపీలో ప్రధాని మోడీ పరిస్థితి బాగా లేదని, ఆయనను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

ప్రధానిని మార్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, నోట్ల రద్దు విషయమై ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో నల్లధనం నగదు రూపంలో కేవలం ఆరు శాతమే ఉందన్నారు.

narendra modi

దీని కోసం రూ.15 లక్షల కోట్ల విలువైన నోట్లను రద్దు చేయడం సరికాదన్నారు. ప్రధాని మోడీ యాభై రోజుల గడువు అడిగారని, గడువు ముగిసినా ప్రజల ఇబ్బందులు తప్పలేదన్నారు. మే నెల వరకు ఇవి కొనసాగుతాయన్నారు. ఆర్బీఐ ఇప్పుడు నోట్ల ముద్రణకు అవసరమైన పేపర్, ఇంకు కోసం గ్లోబల్ టెండర్ వేసిందన్నారు.

కాగా, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం అందుతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఆయన మరో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో చర్చించారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. తెలంగాణకు ఉపాధి హామీ పథకం కింద 2016-17 సంవత్సరానికి రూ.1666 కోట్లు విడుదల చేస్తామన్నారు. త్వరలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 2015-16కు సంబంధించి రూ.142 కోట్లు విడుదల చేయనుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+