జైపాల్ రెడ్డి క‌న్నుమూత‌: రాజ‌కీయ మేధావి..ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా: తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో...!

సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త..కేంద్ర మాజీ మంత్రి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి (79) కన్నుమూశారు. ఆయ‌న కొద్ది రోజులుగా నిమోనియాతో బాధ ప‌డుతున్నారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని గ్యాస్‌ ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ ఈరోజు తెల్లవారు జామున 1.28 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. జైపాల్ రెడ్డి కాంగ్రెస్..జ‌న‌తా పార్టీల్లో క్రియా శీల కంగా ప‌ని చేసారు. అయిదు సార్లు ఎంపీగా..నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేసారు. తెలంగాణ ఉద్యమం..బిల్లు ఆమో ద స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప‌ని చేసిన జైపాల్‌రెడ్డి ఉత్త‌మ పార్ల‌మెం టేరియ‌న్ అవార్డు అందుకున్నారు. కాగా ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని స్వగృహానికి తరలించా రు. వివాద ర‌హితుడిగా జైపాల్ రెడ్డి రాజ‌కీయాల్లో త‌న కంటూ ప్ర‌త్యేక స్థానం సాధించారు.

ఎంపీగా..ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం..

జైపాల్ రెడ్డి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. 1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టిన జైపాల్‌రెడ్డి .. నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్‌ అత్యవసర పాలన ను వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కూడా వ్య‌వ‌హ‌రించారు.

jaipal-reddy-died-on-mid-night-in-hyderabad-at-the-age-of-79

కేంద్ర మంత్రిగా అనేక శాఖ‌ల్లో..

జైపాల్ రెడ్డి ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా అవార్డు అందుకున్నారు. రాజ‌కీయంగా అనుభ‌వంతో పాటుగా లౌక్యం.. మేధావిగా పేరున్న ఆయ‌న వివాద‌ర‌హితుడు. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. 2004లో మిర్యాలగూడ నుండి గెలిచిన జైపాల్ రెడ్డి మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వంలో స‌మాచార ప్ర‌సార శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, 2009 ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ఆయ‌న చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసి గెలుపొంది..మ‌రోసారి యూపీఏ-2 లో కేంద్ర మంత్రి అయ్యారు. పెట్రోలియం శాఖా మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న రిల‌య‌న్స్ సంస్థ‌ల మీద జ‌రిమానా విధించి సంచ‌ల‌నం సృష్టించారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.

తెలంగాణ సాధ‌న స‌మ‌యంలో..

యూపీఏ-2 ప్ర‌భుత్వంలో 2009 డిసెంబ‌ర్ 9న తెలంగాణ ప్ర‌క‌ట‌న నాటి నుండి మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో జైపాల్ రెడ్డి క్రియా శీల‌కంగా మారారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే..తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ ఎంపీల‌కు పెద్ద దిక్కు గా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల ముందు ఫిబ్ర‌వ‌రిలో పార్ల‌మెంట్‌లో తెలంగాణ బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో రాజ‌కీయంగా అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ప్ర‌ధానంగా లోక్‌స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ పెట్టటానికి నాడు స‌భ‌లో ఉన్న అడ్డం కుల‌ను అధిగ‌మించి..బిల్లును మూజువాని ఓటుతో ఆమోదించేలా స్పీక‌ర్‌ను ఒప్పించటంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ల‌కు జైపాల్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. కేసీఆర్ ప్ర‌భుత్వం మీద అనేక విమ‌ర్శ‌లు చేసారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న జైపాల్ రెడ్డి రాజ‌కీయంగా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో మంచి స‌త్సంబంధాలు ఉన్న నేత‌. కొద్ది రోజులుగా అనారోగ్యం కార‌ణంగా జైపాల్ రెడ్డి క్రియా శీల‌క రాజ‌కీయా ల‌కు దూరంగా ఉంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+