తెలంగాణలో వారికి బిగ్ షాక్ ఇచ్చిన ఓటర్లు..!!
Jan Ki Baat exit polls: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
Recommended Video

తెలంగాణపై జన్ కీ బాత్ (Jan Ki Baat) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls)లో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ- అధికార భారత్ రాష్ట్ర సమితికి నిరాశ తప్పదని తేల్చిందీ సర్వే. కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపింది. హస్తం పార్టీకి జైకొట్టింది జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60. బీఆర్ఎస్ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేదని అంచనా వేసింది. 46 నుంచి 56 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో పార్టీ సహకారం అవసరమౌతుందని పేర్కొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని, మూడోసారి అధికారంలోకి రావాలనే ఆ పార్టీ అంచనాలేవీ ఫలించబోవని జన్ కీ బాత్ (Jan Ki Baat exit polls on Telangana) ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురకపోవచ్చని, కారు జోరు తగ్గుతుందని వివరించింది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మోజారిటీని సాధిస్తుందని జన్ కీ బాత్ తెలిపింది. 58 నుంచి 68 స్థానాలతో హస్తం పార్టీ హవా కొనసాగుతుందని తేల్చింది. బీజేపీకి నాలుగు నుంచి తొమ్మిది సీట్లు లభిస్తాయి. అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు అయిదు నుంచి ఏడు సీట్లు దక్కుతాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications