జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్టు : నిర్వాసితుల పరామర్శకు పోలీసుల బ్రేక్

Subscribe to Oneindia Telugu

మెదక్ : మల్లన్న సాగర్ నిర్వాసితులను కలిసి తీరుతామని ఖరాఖండిగా చెబుతున్న కాంగ్రెస్ కు పోలీసుల బ్రేక్స్ తప్పట్లేదు. ఇప్పటికే ఓసారి నిర్వాసితులను కలిసేందుకు గాంధీభవన్ నుంచి బయలుదేరే ప్రయత్నం చేసి అరెస్టయిన కాంగ్రెస్ నేతలను.. మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. అయితే ముందస్తు సమాచారం అందించినా అరెస్టులకు పాల్పడడం దారుణమంటున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇక అసలు విషయానికొస్తే.. మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు సీఎల్పీ జానారెడ్డి, షబ్బీర్ అలీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ముంపు గ్రామాలకు బయలు దేరారు. అయితే విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ, రూరల్ సీఐ, ఒంటిమామిడి చెక్ పోస్ట్ వద్ద భారీగా పోలీసులను మోహరించి జానారెడ్డి, షబ్బీర్ అలీ వాహనాలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Janareddy, Shabbir Ali both are arrested while going mallanna sagar villages

అరెస్టుల అనంతరం నేతలను మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం. ఈ సందర్బంగా మాట్లాడిన పోలీసు ఉన్నతాధికారులు.. ఎట్టి పరిస్థితుల్లోను విపక్ష నేతలను ముంపు గ్రామాల్లో పరామర్శకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే జానారెడ్డి మాత్రం పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ముందస్తు సమాచారం అందించిన అరెస్టులకు పాల్పడడం బాధాకరమన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janareddy, Shabbir Ali both are arrested at onti mamidi check post while going mallanna sagar villages. CLP Leader Janareddy opposed the police behaviour regarding arrests

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి