తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీ. జనసేన పోటీ చేసే 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను మంగళవవారం ప్రకటించింది.

కూకట్‌పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి.

Janasena releases list of mla candidates for 8 seats in telangana

ఇటీవలే ఖరారైన బీజేపీ-జనసేన పొత్తు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర నేతలు గత శనివారం రాత్రి జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్, కోదాడ, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించినట్లు సమాచారం.

అయితే, శేరిలింగంపల్లి స్థానంపై మాత్రం ఎటూతేల్చలేకపోయినట్లు తెలిసింది. ఈ స్థానం కోసం జనసేన పట్టుపడుతుండగా.. ఇప్పటికే బీజేపీ నేతలు చాలా మంది ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన అనంతరం శేరిలింగంపల్లి స్థానంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Janasena releases list of mla candidates for 8 seats in telangana

కాగా, మొదట జనసేన 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా.. తాజా చర్చల్లో 8 స్థానాలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా బీజేపీ, జనసేన నేతలు నిర్ణయిచారు. 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మంగళవారం మరో 12 మందితో జాబితాను విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+