‘జనసేన అధికార ప్రతినిధి’ కల్యాణ్ అరెస్ట్ వెనుక అసలు కారణమిదేనా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిన సుంకర కళ్యాణ్ దిలీప్ గురించిన మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో సీసీ కెమెరాల వ్యాపారం చేస్తున్న సుంకర కల్యాణ్ దిలీప్ రెండ్రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

పాడైన, వారంటీ ముగిసిన ఫోన్లు..

పాడైన, వారంటీ ముగిసిన ఫోన్లు..

ఈ కేసులో విచారణ తరువాత పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం.. కండిషన్‌లో లేని, వారంటీ ముగిసిన ఫోన్ ను కల్యాణ్ విక్రయించడం గొడవకు ప్రధాన కారణం. సెకండ్ హ్యాండ్ వస్తువుల ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్‌లో తన ఐఫోన్‌ను కల్యాణ్ అమ్మకానికి పెట్టగా, సైఫాబాద్ ప్రాంతానికి చెందిన మిథున్ చక్రవర్తి దాన్ని రూ. 34 వేలకు కొనుగోలు చేశాడు.

  Jana Sena contesting along with TDP in 2019 elections టీడీపీకి 'పవన్'పై కొండంత ఆశ | Oneindia Telugu
  పనిచేయని ఫోన్ అంటగట్టి..

  పనిచేయని ఫోన్ అంటగట్టి..

  ఆ తర్వాత వారిద్దరి మధ్యా జరిగిన గొడవ కల్యాణ్‌లోని మరోకోణాన్ని వెలుగులోకి తెచ్చి అరెస్ట్‌కు దారి తీసింది. ఫోన్‌ను కొనుగోలు చేసిన చక్రవర్తి, ఇంటికి వెళ్లి చూసుకోగా.. అది సరిగా పనిచేయడంలేదు. వారంటీ కూడా ముగిసింది. దీంతో ఆ ఫోన్ తనకు వద్దని చెబుతూ.. పలుమార్లు డబ్బు తిరిగి ఇవ్వాలని కల్యాణ్‌ను కోరాడు.

   చంపేస్తా..

  చంపేస్తా..

  ఈ క్రమంలో అక్టోబర్ 21వ తేదీన రాత్రి పదింటికి పద్మారావు నగర్‌లోని బాలాజీ డాబా వద్దకు రావాలని మిథున్‌ను కల్యాణ్ కోరాడు. అక్కడికి మిథున్ వెళ్లగా.. ఇద్దరి మధ్యా మరోసారి వాగ్వాదం జరిగింది. తన వద్ద పిస్టల్ ఉందని బెదిరిస్తూ.. కారులో ఉన్న డమ్మీ పిస్టల్‌ను తీసి మరోసారి డబ్బులు అడిగితే హత్య చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.

  చీటింగ్ కేసు ఎఫెక్ట్: మోసకారి మాటలు నమ్మొద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరిక

   కారు, పిస్టల్, ఫోన్లు సీజ్

  కారు, పిస్టల్, ఫోన్లు సీజ్

  ఈ క్రమంలో బాధితుడి ద్వారా ఫిర్యాదు అందుకున్న నార్త్ జోన్ పోలీసులు కల్యాణ్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 'ఏపీ 09 సీజీ 2818 నెంబర్ గల కారును, డమ్మీ పిస్టల్, ఆరు బుల్లెట్లు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం అతడ్ని రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఫేక్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని జనసేన శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that janasena's leader kalyan sunkara arrested for phone fraud.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి