Janata Curfew: తెలంగాణలో లాక్ డౌన్..?, ఈ నెల 31వ వరకు, అత్యున్నతస్థాయి సమావేశంలో నిర్ణయం..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రెండో స్టేజీ నుంచి మూడో స్టేజీకి వైరస్ సోకుతుండటంతో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిశీతంగా పరిస్థితులను గమనిస్తోంది. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో నిర్ణయం తీసుకొంటారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ పిలుపుమేరకు చప్పట్లు కొట్టాక.. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు.

లాక్ డౌన్
రాష్ట్రంలో సిచుయేషన్ సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో ఈ నెల 31వరకు లాక్ డౌన్ విధిస్తామని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆదివారం మాదిరిగానే 31వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండనుంది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. విదేశాల నుంచి వచ్చినవారే గాక.. నిన్న కేపీహెచ్‌బీలో రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కూడా వైరస్ సోకడంతో.. మరింత మందికి వైరస్ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

11 వేల మంది..
శుక్రవారం రోజునాటి మీడియా సమావేశంలో రాష్ట్రంలో 11 వేల మందిని అదుపులోకి తీసుకున్నామని మిగిలినవారు కూడా లొంగిపోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చినా సంగతి తెలిసిందే. వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్ కూడా 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

ఎమర్జెన్సీకి మాత్రం..
అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టంచేశారు. పాలు, కూరగాయలు విక్రయం, మెడికల్ షాప్, ఆస్పత్రులు, పారిశుద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. 22వ తేదీ నుంచి 31 వరకు పదిరోజుల పాటు జనం ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌పై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయం మేరకు డిసిషన్ తీసుకున్నట్టు సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications