'హైదరాబాదీ బిర్యానీ ఓ వ్యసనం..' జపాన్ అంబాసిడర్ షాకింగ్ పోస్టు..
హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. నిజాం నవాబుల కాలం నుంచి ఇక్కడి బిర్యానీ ఎంతో ప్రాచుర్యం పొందింది. చాలామందికి హైదరాబాద్ అనగానే బిర్యానీనే గుర్తుకువస్తుంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు హైదరాబాదీ బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే జపనీస్ అంబాసిడర్ ఓనో కీచీ.. హైదరాబాద్ లో పర్యటించారు. హైదరాబాదీ బిర్యానీని రుచి చూశారు. హైదరాబాదీ బిర్యానీ ప్రశంసలు కురిపించారు. ఇది ట్రూలీ అడిక్టివ్ అని కితాబు ఇచ్చారు. దీన్ని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఇన్ స్టా పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో దీనికి ఫ్యాన్స్ ఉంటారు. ఎన్నిరకాల బిర్యానీలు ఉన్నా హైదరాబాదీ బిర్యానీ టేస్టు మరెక్కడా లభించదని చాలామంది ఫుడ్ లవర్స్ చెబుతుంటారు. నిజాం కాలం నుంచి ఈ బిర్యానీ ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే ఇటీవల తెలంగాణలో పర్యటించారు జపనీస్ అంబాసిడర్ ఓనో కీచీ. . పర్యటనలో భాగంగా హైదరాబాదీ బిర్యానీ రుచి చూశారు. ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు.
" హైదరాబాదీ అథెంటిక్ బిర్యానీని ఎంజాయ్ చేశాను. తెలంగాణలో పర్యటనలో భాగంగా హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేశాను. రిచ్ స్పైసెస్, మంచి సువాసనతో ఉంది.. ఇది ట్రూలీ అడిక్టివ్ గా ఉంది" అని జపనీస్ అంబాసిడర్ ఓనో కీచీ తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. ఈ మేరకు బిర్యానీని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. బిర్యానీలోకి పూదీనా యోగర్ట్ చట్నీ తింటున్నట్లు ఫోటోలో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. యూ ఆర్ మై ఫేవరేట్ అంబాసిడర్ అని కామెంట్ పెడుతున్నారు. మరోవ్యక్తి కామెంట్ చేస్తూ.. సర్ మీరు ఆంధ్రాకు రండి.. ఆంధ్రా వంటలను కూడా ఆస్వాదించండి అన్నాడు.












Click it and Unblock the Notifications