Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదు .. కానీ అన్నింటికీ ఆమె కారణం ..?

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరాం హత్య కేసు కొలిక్కివచ్చినట్టేనా ? ఇన్నిరోజుల తర్వాత చార్జీషీట్ వెలుగులోకి రావడం ఎలా చూడాలి ? ఇంతకీ నేరం చేసిందేవరు ? చేయించిందేవరు ? చార్జీషీట్‌‌లో పొందుపరిచిన ఆధారంగా నేరస్తులుగా పరిగణించాలి ? ఈ కేసు మొత్తం జయరాం మేనకోడలు శిఖా చౌదరి చుట్టు తిరిగిన సంగతి తెలిసిందే. కానీ నిందితుల్లో ఆమె పేరును చేర్చకపోవడాన్ని ఎలా చూడాలి ? ఇంతకీ శిఖా చౌదరీ ప్రమేయం లేకుండానే జయరాం హత్య జరిగిందా అనే సందేహలు సగటు మనిషి మెదడును తొలచివేస్తోంది.

శిఖా చౌదరి లేని చార్జీషీట్ ..?

శిఖా చౌదరి లేని చార్జీషీట్ ..?

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. కానీ కేసు పురోగతికి సంబంధించి చార్జీషీట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పేరు లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి శిఖా చౌదరి ట్రయాంగిల్ లవ్‌స్టోరి ఆధారంగానే జయరాం హత్యకు గురయ్యారనే అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. తనను పెళ్లిచేసుకోకుండా .. దూరంగా ఉంటూ, తీసుకున్న రూ.5 కోట్లు ఇవ్వకపోవడంతోనే రాకేశ్ రెడ్డి కోపానికి గురై జయరాంపై దాడిచేసిన సంగతి ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ కేసులో చాలామందిని నిందితులుగా చేర్చారు. కానీ సాక్షి జాబితాలో శిఖా చౌదరి పేరు చేరడంతో ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నగదు ఇవ్వలేదు ..

నగదు ఇవ్వలేదు ..

ఫార్మా కంపెనీలు, ఎక్స్ ప్రెస్ చానెల్ చైర్మన్‌గా ఉన్న జయరాం .. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు రూ.5 కోట్లను రాకేశ్ రెడ్డి వద్ద తీసుకున్నాడు. ఆ నగదు ఇప్పించింది కూడా శిఖా చౌదరి. తర్వాత శిఖా చౌదరి పెళ్లితో జయరాం అడ్డుపడటం ... నగదు తిరిగి ఇవ్వకపోవడంతో హత్యకు దారితీసిన సంగతి తెలసిందే. అయితే అమెరికా నుంచి వచ్చిన జయరాం .. రాకేశ్ ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో రగిలిపోయాడు. దీంతో అమ్మాయిలంటే పడిచచ్చే జయరాంకు .. హనీట్రాప్ వేశాడు. ఓ యాంకర్‌తో ఫోన్ చేయించి గెస్ట్ హౌస్ వద్దకు రప్పించిన సంగతి తెలిసిందే. అక్కడ రెచ్చిపోయిన రాకేశ్‌రెడ్డి డబ్బులివ్వమంటే .. లక్షలు అరెంజ్ చేస్తామని చెప్పడంతో భౌతికదాడి చేశాడు. అప్పటికే హార్ట్ పేషెంట్ అయిన జయరాం కుప్పకూలి .. చనిపోయాడు. తర్వాత తనకు తెలిసిన పోలీసుల సహకారంతో ఏపీకి తరలించి .. కేసును తప్పుదారి పట్టించే యత్నం చేసిన సంగతి తెలిసిందే.

చిత్రహింసలు ..

చిత్రహింసలు ..

హనీట్రాప్ చేసి .. జయరాంను రాకేశ్ అండ్ కో చిత్రహింసలు పెట్టారు. డబ్బులు అరెంజ్ చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. డాక్యుమెంట్లు ఇస్తానని చెప్పినా పట్టించుకోకుండా కొట్టడంతో సోమసిల్లి పడిపోయాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకొని .. తప్పించుకునేందుకు రాకేశ్ చేసినా వ్యవహారమంతా తెలిసిందే. తన మిత్రులైన పోలీసుల సహకారంతో మృతదేహన్ని ఏపీకి తరలించి .. తప్పించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చార్జీషీట్ .. సాక్షుల జాబితాలో శిఖా ..

ఇదీ చార్జీషీట్ .. సాక్షుల జాబితాలో శిఖా ..

జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డి, విశాల్, వాచ్ మెన్ శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేశ్, నటుడు, కమెడియన్ సూర్యప్రసాద్, అతని ఫ్రెండ్ కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, టీడీపీ నేత బీఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి .. 8 మంది నిందితులుగా చేర్చారు. వీరితోపాటు ముగ్గురు పోలీసుల పేర్లను కూడా నమోదు చేశారు. నల్లకుంట, రాయదుర్గం మాజీ సీఐలు శ్రీనివాసులు, రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిను నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 73 సాక్షుల పేర్లను చార్జీషీట్‌లో ప్రస్తావించారు. అయితే సాక్షుల పేర్లలో 11వ సాక్షిగా చార్జిషీట్‌లో శిఖాచౌదరి పేరును పోలీసులు చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+