టిఆర్ఎస్ జ్యోతిగా మార్చి, ఫూల్స్ చేస్తున్నారు: రావుల, జీవన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్‌పై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక పథకం రూపొందించి, ఏడాది గడిచినా ఒక్కపైసా విడుదల చేయలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.

ప్రజల దృష్టిని మరల్చడానికే గ్రామజ్యోతి పథకం ప్రవేశపెడుతోందని జీవన్‌రెడ్డి ద్వజమెత్తాడు. విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉండటం వల్లే కోతల్లేవన్నారు. కానీ, సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ కొరతను ఆధిగమించామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వర్షాలు లేక రైతులు ఇబ్బందులుపడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

టిఆర్‌ఎస్‌ జ్యోతిగా మారిన గ్రామజ్యోతి: రావుల

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి పథకం టిఆర్ఎస్ జ్యోతిగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మన ఊరు మన ప్రణాళికకు గ్రామజ్యోతికి తేడా ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Jeevan Reddy and Ravula fires at KCR

ఫండ్స్ పూలింగ్‌ పేరుతో జనాలను ఫూల్స్‌ను చేస్తున్నారని, గ్రామపంచాయతీలకు నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. అలాగే 63, 64 జీవోలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, సర్పంచ్‌ల స్థాయిని దిగజార్చేలా ఆ జీవోలున్నాయని ఆయన విమర్శించారు.

అక్రమ సంపాదనపై ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారా?: ప్రతాప్‌రెడ్డి

అక్రమ సంపాదనపై ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారా? అని మంత్రి హరీష్‌రావునుద్దేశించి తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లా నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి హరీష్‌రావుకు దమ్ము, ధైర్యం ఉంటే తన ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని, అక్రమాస్తులు తేలే వరకు మెదక్ కలెక్టకేట్ వద్ద దీక్షకు సిద్దమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.

గ్రామజ్యోతిలో ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి: ఎర్రబెల్లి

గ్రామజ్యోతి కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల సందర్బంగా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిని గత టీడీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆయనన్నారు.

భద్రత కల్పించడం లేదు: రాజాసింగ్

‘గత కొద్ది రోజులుగా నన్ను హత్య చేస్తామని నాకు బెదిరింపు ఫోన్‌లు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు' అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయారు.

తనకు భద్రత కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదని, తనకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అయనన్నారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హత్యచేస్తామని బెదిరించిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఇందిరాపార్క్‌ దగ్గర జాతీయ హిందూ ఉద్యమం ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+