Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరీంనగర్ నుండే కుదుపు.!గులాబీ పార్టీలో అసమ్మతి గళం.!వలసలు మొదలైట్టేనా.?

కరీంనగర్/హైదరాబాద్: గత ఏడు సంవత్సరాలుగా అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న గులాబీ పార్టీలో అనూహ్యంగా గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ లో పార్టీ ఓటమి పాలవ్వడం, గులాబీ ప్రభుత్వంపై ఇతర పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించడం, సీఎం చంద్రశేఖర్ రావు పై బీజేపి పైచేయి సాధించడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిఖార్సైన ఉద్యమకారులకు కాకుండా ఇతర పార్టీలనుండి వచ్చిన నేతలకు అవకాశాలు కల్పిండం వంటి పరిణామాలు పార్టీ నేతలకు మిండుగుపడని అంశాలుగా పరిణమించాయి. దీంతో ఎప్పుడూ లేని విధంగా వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ నుండే ఈ అసంతృప్తి వినిపించడం చంద్రశేఖర్ రావు కోటరీని విస్మయారికి గురిచేస్తోంది.

 పడ్డ అవమానాలు చాలు.. ఇక పార్టీలో కొసాగలేమంటున్న కరీంనగర్ గులాబీ నేతలు..

పడ్డ అవమానాలు చాలు.. ఇక పార్టీలో కొసాగలేమంటున్న కరీంనగర్ గులాబీ నేతలు..

కరీంనగర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్టు తెలుస్తోంది. అసమ్మతి అంటే ఎలా ఉంటుందో తెలియని గులాబీ నేతలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందుకు కేంద్ర బిందువు కావడం గులాబీ అగ్రనేతలను విస్మయానికి గురిచేస్తున్న అంశంగా చర్చ జరుగుతోంది. కరీంనగర్ జిల్లా నుండి వరుస రాజీనామాలు చోటు చేసుకోవడం గులాబీ నేతలను కలవరానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలబడ్డ అనేక మంది సీనియర్ నేతల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రశేఖర్ రావు ఏకపక్షంగా వ్యవహరించారని బహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు పాల్పడటం గులాబీ నేతలకు షాకింగ్ పరిణామంగా మారింది.

 పార్టీ బలపడింది కరీంనగర్ లోనే.. పార్టీ బలహీనపడేది కూడా ఇక్కడనుంచే అంటన్న నేతలు

పార్టీ బలపడింది కరీంనగర్ లోనే.. పార్టీ బలహీనపడేది కూడా ఇక్కడనుంచే అంటన్న నేతలు

తెలంగాణ ఉద్యమ గడ్డ కరీంనగర్‌లో అధికార రాష్ట్ర సమితి పార్టీకి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పట్టణానికి చెందిన కీలక నేత రవీందర్ సింగ్ తన రాజీనామాతో మొదలైన అసమ్మతి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రవీందర్ సింగ్ బాటలోనే అనేక మంది లోకల్ నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలబడ్డ అనేక మంది సీనియర్ నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ అసంతృప్తిని బాహాటంగా చాటుకుంటూనే రాజీనామాలకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం విజయం సాదిస్తుందా అనే అంశం ఉత్కంఠగా మారింది.

 వినిపిస్తున్న అసంతృప్తి గళాలు.. వలసలు మొదలైనట్టే అంటున్న స్ధానిక నేతలు..

వినిపిస్తున్న అసంతృప్తి గళాలు.. వలసలు మొదలైనట్టే అంటున్న స్ధానిక నేతలు..

సింహ గర్జన సభతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కరీంనగర్ గడ్డ ఇప్పుడు అదే రకంగా అనూహ్యంగా పతనానికి కారణం అవుతుందని టీఆర్ఎస్‌కు చెందిన మాజీ సీనియర్ నేత రవీందర్ సింగ్ ప్రకటించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అనేక మంది నేతలు రాజీనామాల ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తమ విజయం తథ్యమని ధీమాతో ఉన్న అగ్ర నేతల అహంకారం తమ విజయం ద్వారా అణిగిపోతుందని రవీందర్ సింగ్ జోస్యం చెప్పారు. కరీంనగర్ నుండే తెలంగాణ ఉద్యమం బలపడింది, కరీంనగర్ నుండే పతనం మొదలవుతుందని రవీందర్ సింగ్ స్పష్టం చేస్తున్నారు.

పోలీంగ్ రోజు చెప్తాం.. రెబల్ అభ్యర్ధుల ప్రతాపం చూపిస్తామంటున్న నాయకులు

పోలీంగ్ రోజు చెప్తాం.. రెబల్ అభ్యర్ధుల ప్రతాపం చూపిస్తామంటున్న నాయకులు

ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేని ఎల్.రమణ లాంటి నేతలకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక నాయకులను అవమానపరిచాడని సీఎం చంద్రశేఖర్ రావు మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్టీ నాయకుల పట్ల చిత్త శుద్ది లేని భాను ప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎమ్మెల్సీగా కొనసాగించడం దుర్మార్గం అంటున్నారు స్థానిక సీనియర్ నేతలు. సంవత్సరల తరబడి పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్నా సరైన గుర్తింపు లేదు కాబట్టే రాజీనామా చేసి చంద్రవేఖర్ రావుతో తాడోపేడో తేల్చుకుంటామని అంటున్నారు. పోలింగ్ జరిగే డిసెంబర్ 10న అసలు ఫలితాలు బయటపడతాయని, అప్సుడు తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని రెబల్ అభ్యర్థులు గులాబీ అగ్రనేతలను హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+