johnny Master: ఇది లవ్ జిహాద్ కేసే!
టాలీవుడ్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై నటి కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు. ఇది లవ్ జిహాద్ కేసు అని అన్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసులో తప్పు రుజువైతే జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి డిమండ్ చేశారు.
జానీ మాస్టర్ మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏంటని ప్రశ్నించిన కరాటే కళ్యాణి.. బాధితురాలికి అందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు.

బాధిత యువతిపై ఐదేళ్లపాటు లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది లవ్ జిహా్ కేసుగా శిల్పారెడ్డి పేర్కొన్నారు. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టమేంటని ప్రశ్నించారు. ఇంత వరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పా రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు, హిందూ మహిళలను మతం మార్చి లైంగికంగా వేధించే ఘటనలు తీవ్రమైనా.. కాంగ్రెస్ ప్రభుత్వం చీకమకుట్టినట్లు కూడా వ్యవహరించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. దీనికి హోంశాఖ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కాగా, జానీ మాస్టర్ వేధింపుల కేసులో తాజాగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, నిందితుడు జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిపై ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులకు పాల్పడటంతో పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చే పరిస్థితులు కూడా లేవు.












Click it and Unblock the Notifications