తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా..
Telangana Media Academy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. దశలవారీగా వివిధ కార్పొరేషన్లు, అకాడమీలకు ఛైర్మన్లను నియమిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జీ చిన్నారెడ్డిని నియమించింది. శనివారమే ఉత్తర్వులు జారీచేసింది.
తాజాగా మరో కీలక నియామకాన్ని చేపట్టింది. తెలంగాణ మీడియా అకాడమీకి కొత్త ఛైర్మన్‌ను ప్రకటించింది. సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డి.. మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాల పాటు శ్రీనివాస్ రెడ్డి ఈ హోదాలో కొనసాగుతారు.

ఇదివరకు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి మొన్నటి వరకు ఆయనే ఆ స్థానంలో కొనసాగారు. అప్పటి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. ఆయనను అకాడమీ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనితో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న వివిధ కార్పొరేషన్లు, అకాడమీల ఛైర్మన్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్వచ్ఛందంగా తమ పదవులను వదులుకున్నారు.
వారి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. వివిధ దినపత్రికల్లో ఎడిటర్ హోదాలో పని చేశారు. గతంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.












Click it and Unblock the Notifications