అవినీతి, అసమర్థ పాలన: బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా

ఖమ్మం: దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీనేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ 11 స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చారని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. మరో రెండేళ్లలో మనదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని జేపీ నడ్డా తెలిపారు.

తెలంగాణకు కేంద్రం పదేళ్లుగా అన్ని రకాలుగా సాయం చేసిందన్న జేపీ నడ్డడా.. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందని చెప్పారు. సికింద్రాబాద్‌, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. మనదేశంలో తయారైన ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయన్నారు. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్‌ చైనా, కొరియా, జపాన్​వి ఉండేవని.. ఇప్పుడు మేకిన్ ఇండియా పేరుతో ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తున్నామని నడ్డా వివరించారు.

JP Nadda hits out at congress and brs in kothagudem bjp public meeting

దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని జేపీ నడ్డా చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని, మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స లభిస్తుందన్నారు. భవిష్యత్తులో పైపులైను ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేస్తామని తెలిపారు.

ఎస్టీల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి చేసిందని.. గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని జేపీ నడ్డా తెలిపారు. గిరిజన రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి అండగా ఉన్నాం. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. మనదేశ ఆర్థిక వ్యవస్థను మోడీ 11 నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చారు. వచ్చే రెండేళ్లలో మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. తమ పాలనలో 25 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

అయోధ్యలో రామ మందిరం

విపరీతమైన ఎండలో కూడా ప్రజలు తమ మీద ప్రేమతో తమ సభకు తరలివచ్చారని జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్‌, వినోద్‌రావు గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోడీ సాకారం చేశారన్నారు. తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై నిప్పులు

మరోవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నడ్డా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైనదని.. కాంగ్రెస్‌ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి చేశారని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నామన్నారు. ఇండియా కూటమి ఆయా పార్టీల వారసుల కోసమేనని అన్నారు. ఇండియా కూటమిలో నేతలంతా కుంభకోణాలకు పాల్పడ్డవారేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతేనని.. వారి ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శక్తులన్నీ విజృంభిస్తాయని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+