తాత బాటలోనే, ఎప్పుడూ గుండెల్లోనే: జూ. ఎన్టీఆర్

ఎన్టీఆర్‌ మార్గాన్ని అనుసరిస్తామని సినీ హీరో ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్: ఎన్టీఆర్‌ మార్గాన్ని అనుసరిస్తామని సినీ హీరో ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ 21 వ వర్ధంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌, జూ.ఎన్టీఆర్, తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మనల్ని విడిచి వెళ్లిపోయి ఏళ్లు గడుస్తూనే ఉన్నాయని అన్నారు. ఏళ్లైనాకొద్దీ ఆయన లేని భావం మరింత ఎక్కువ కలుగుతూనే ఉందని అన్నారు. మహానుభావులు మనల్ని భౌతికంగా విడిచివెళ్లిపోయినా.. వారు చేసిన మంచి పనులు మన చుట్టూనే ఉంటాయని చెప్పారు.

Jr NTR and family pays respects to late NT Rama Rao at NTR Ghat

తాతా ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలోనే ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు. మహిళలు, ప్రజల కోసం ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఆయన తమకు మంచి మార్గాన్ని చూపారని, ఆయన ఆశయాలతోనే ముందుకు సాగుతామని ఎన్టీఆర్ తెలిపారు.

హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ గురించి మాట్లాడాలంటే సమయం చాలదని అన్నారు. ఆయన మహోన్నతమైన వ్యక్తని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. దేశంలో ఎందరో మహానుభావులున్నారు కానీ, ఎన్టీఆర్‌కు ప్రత్యేకత ఉందని అన్నారు. ఆయన సంస్కరణల ద్వారా రాష్ట్ర దిశనే కాదు, దేశ దిశను కూడా మార్చిన మహా మనిషి అని హరికృష్ణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+