Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని భారతీయ జనతాపార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా? అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితికి ఆ పార్టీ చేరుకుంది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికారంలోకి రావాల్సిన తరుణంలో.. పార్టీ అధ్యక్షుడిని మార్చి ఒకరకంగా బీజేపీ ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కూడా కావాలనే చేశారని, ఒక పార్టీకి అనుకూలంగా ఉండేందుకే ఇలా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.

డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలి
అయితే ఈ ఎన్నికలో ఓటమి పార్టీలో అంతర్గత విభేదాలకు దారి తీసింది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందనేది పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమికి వీరిద్దరి మధ్య సమన్వయ లోపమే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ కు, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడిచింది.ఈటల డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలని, లేదంటే పార్టీ గెలుపు కష్టమని, తాను హిందూయిజాన్ని వదిలిపెడితే.. భౌతికంగా తానున్నా లేనట్లేనంటూ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు.

jubilee-hills-by-election-a-rift-in-telangana-bjp

మత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న ఈటల
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అన్ని బాధ్యతలు తీసుకున్నప్పటికీ పార్టీని మాత్రం గెలిపించలేకపోయారు. ఆయన రాజకీయం ఏమిటనేది ఆ పార్టీ శ్రేణులకు కూడా అంతుపట్టకుండా ఉంటుంది. ప్రచారం కూడా సరిగా చేయలేదు. నాయకులందరి మధ్య విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి విభేదాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు గండి కొడుతూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాయి. అయతే ఈటల రాజేందర్ మాత్రం బీజేపీకి పునాది లాంటి మత సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు. మత రాజకీయమాలు మంచివి కావంటున్నారు. ఆయన కూడా ఇతర నేతలు డివిజన్ పాలిటిక్స్ మానుకోవాలని వ్యాఖ్యలు చేశారు.

గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకాలు లేవు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెస్తారని కలలు కంటున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఈ ప్రధాన నేతల మధ్య ఉన్న విభేదాలు, జరుగుతున్న మాటల యుద్ధం పార్టీని బలహీనపరుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామచంద్రరావును అధ్యక్షుడిగా చేసినా బీజేపీ రాత మారలేదు. ఎమ్మెల్యేలమీద కూడా ఎవరికీ అదుపు లేదు. వారిష్టమొచ్చినరీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తనను తాను మార్చుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకాలైతే కనపడటంలేదనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+