Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అభివృద్ధే ఆయుధం, జనబలమే నినాదం: జూబ్లీహిల్స్‌లో ప్రజా పాలన విజయోత్సవాల ఊపు!

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో అధికార ప్రజా ప్రభుత్వం అభివృద్ధి ఎజెండాను బలంగా ముందుకు తెచ్చింది. తమ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు లక్ష మందిని దాటడంతో, ఈ ఉప ఎన్నికను 'ప్రజా పాలన విజయోత్సవం'గా మార్చాలని అధికార పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లు ఉండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు అత్యంత నమ్మకమైన ఓటు బ్యాంకుగా మారతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

లక్ష మందికి పైగా లబ్ధిదారులు: సంక్షేమమే ప్రధాన బలం
అభివృద్ధి నినాదంతో ప్రజా ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముందంజలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లున్నారు. నియోజకవర్గంలోని దాదాపు లక్ష కుటుంబాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారు. ఆరు గ్యారంటీలతో పాటు సన్న బియ్యం పథకాలు, ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ ఇక్కడ అధికార పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా మారాయి. నియోజకవర్గంలో 200 యూనిట్లలోపు ఉచిత గృహ విద్యుత్‌తో 25,925 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. రూ.500లకు గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల్లో 19,658 కుటుంబాలు ఉన్నాయి.

Jubilee Hills By-Election Development Agenda and Welfare Schemes Drive Government Confidence

ఉచిత బస్సు ప్రయాణంతో రూ.120 కోట్లు ఆదా
ప్రజా ప్రభుత్వం అమలు చేసిన అత్యంత విజయవంతమైన పథకాల్లో ఒకటైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం) జూబ్లీహిల్స్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌లో కోటి మందికిపైగా మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించారు. దీని ద్వారా దాదాపు రూ.2,410 కోట్లు ఆదా అయినట్లు అంచనా. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు రూ.120 కోట్లు ఆదా చేసుకున్నారు. ఈ ఆర్థిక ఉపశమనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికార కాంగ్రెస్ భావిస్తోంది.

సన్న బియ్యం.. కొత్త కార్డుల పంపిణీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. మొత్తం 14,197 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 8,123 మంది పేర్లను నమోదు చేసింది. అంతేకాకుండా.. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారులను ఆకర్షించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ విజయవంతంగా అమలవుతోంది. సిటీలో ప్రతి రోజు 25 వేల మంది పేదలు, బస్తీ వాసులు, రోజువారీ కూలీలు మరియు చిన్న ఉద్యోగులు ఈ పథకంతో డబ్బు ఆదా చేసుకుంటున్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారీ ఖర్చు
ప్రజా ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (SDF) కింద రూ.5.51 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్మాణంలో ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు క్రమం తప్పకుండా నల్లా నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. నల్లా నీటి సరఫరాతో పాటు సీవరేజీ అభివృద్ధి పనులకు రూ.6.43 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి రూ.826 కోట్ల ఖర్చుతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.కొత్తగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, 11 కేవీ ఫీడర్‌లు మరియు 13 కిలోమీటర్ల మేరకు ఎల్టీ లైన్ ఆధునీకరణ పనులకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో రూ.162 కోట్లతో అండర్ గ్రౌండ్ విద్యుత్తు లైన్ వేయాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

మొత్తం మీద, ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు విజయాన్ని ఖాయం చేస్తుందని అధికార పార్టీ నమ్మకంతో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+