కాంగ్రెస్‌ను నిండా ముంచేది హైడ్రానే..!
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడితో మండుతున్నాయి. నవంబర్ 11న జరగబోయే పోలింగ్‌కు ముందు, అధికార కాంగ్రెస్, సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్, బలపడాలని చూస్తున్న బీజేపీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే, ఈ పోరును అనూహ్యంగా మలుపు తిప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ హైడ్రా'.
అనధికార నిర్మాణాలపై జరుగుతున్న ఈ కూల్చివేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారాయి. అధికార కాంగ్రెస్‌కు ఇదే ఇప్పుడు పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉప ఎన్నికను కేవలం ఒక నియోజకవర్గ పోటీగా కాకుండా, ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా రెఫరెండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన 'హైడ్రా' ఆపరేషన్‌లో జరుగుతున్న వివక్షపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ధనవంతుల అక్రమ నిర్మాణాలపై చూపు పడడం లేదని, కానీ నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లే లక్ష్యంగా కూల్చివేతలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 15 మంది పెద్ద బిల్డర్ల నిర్మాణాల్లో తప్పులున్నాయని అంగీకరించినా, వారిపై చర్యలు శూన్యమని నిలదీశారు.సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉన్నా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంపైనా చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం పెంచుతోందని పేర్కొన్నారు.
మజ్లిస్ నేతల ఆస్తులు, ముఖ్యంగా ఒవైసీ కుటుంబానికి చెందిన కట్టడాలు చెరువుల ఆక్రమణలో ఉన్నా అవి 'హైడ్రా' పరిధిలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.కేటీఆర్ ఈ సందేశాన్ని ఓటర్లకు చేరవేసేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సహా ఉదాహరణలను చూపిస్తూ, ప్రభుత్వం 64 రంగాలను దెబ్బతీస్తూ బలవంతులను ఆదరిస్తోందని మండిపడుతున్నారు.
'హైడ్రా' ఆపరేషన్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గందరగోళంలో పడిందని, పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్ రావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. మీ ఇళ్లను, మీ వ్యాపారాలను కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించండి అంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజధానిలో ప్రభుత్వ వైఖరిపై ప్రజల అభిప్రాయాన్ని, ఆపరేషన్ హైడ్రా ప్రభావం ఎంత ఉందో స్పష్టం చేస్తుంది.












Click it and Unblock the Notifications