Jubilee Hills కౌంటింగ్ వేళ.. అభ్యర్థి మృతి
జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తోన్నారు. యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్లను లెక్కిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాటన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే పూర్తి చేసింది. మొత్తం 10 రౌండ్ల పాటు లెక్కింపు పూర్తి కానుంది. 42 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకల్లా విజేత ఎవరో తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు లక్షలమందికి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ.. అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. సగం కూడా పోలింగ్ నమోదు కాలేదు. 1,94, 632 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాల మధ్య జూబ్లీహిల్స్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మహ్మద్ అన్వర్ మరణించారు. గుండెపోటుతో కన్నుమూశారు. ఎర్రగడ్డలో ఆయన నివాసం ఉంటోన్నారు. ఎన్సీపీలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తోన్నారు. ఈ డివిజన్ పై ఆయనకు మంచి పట్టు ఉంది. ఫలితాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన హఠాన్మరణంతో పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications