జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్.. సీన్ రివర్స్.. గెలిచేది ఆ పార్టీనే..
ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ అధికార కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపాయి. కాంగ్రెస్ పార్టీకే గెలిచే అవకాశం ఉందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఓ సారి చూస్తే.. చాణక్య స్టేటజీస్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్ కు41 శాతం అలాగే బీజేపీకు 06 శాతంగా అంచనా వేసింది.
ఇక పీపుల్స్ పల్స్ సంస్థ.. కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 06 శాతం అని తేల్చింది. అలాగే స్మార్ట్ పోల్ సంస్థ అంచనాలను చూస్తే.. కాంగ్రెస్ 48.2 శాతం అలాగే బీఆర్ఎస్ 42.1 శాతం ఇక బీజేపీ 06 శాతం ఓట్లు వచ్చినట్లు స్పష్టం చేసింది. నాగన్న సర్వే వివరాలు చూస్తే.. కాంగ్రెస్ కు 47 శాతం ఓట్లు వచ్చినట్లు తేల్చింది. అలాగే బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీ కు 08 శాతం ఓట్లు పడినట్లు అంచనా వేసింది. జన్ మైన్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టింది. పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) సర్వే.. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పేర్కొంది.

ఇక బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేశారు. వీరితో పాటు మరో 58 మంది ఈ ఉపఎన్నిక బరిలో నిలిచారు. ఈ నెల 14న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications