జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అనారోగ్యం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. కాగా, గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గత కొన్నేళ్ళ క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లడంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు కిడ్నీ ఫెయిల్యూర్ అని వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే మరింత అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆయన కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Jubilee Hills MLA Maganti Gopinath admitted to hospital due to serious illness

నాలుగు రోజుల నుంచి ఆస్పత్రిలోనే మాగంటి గోపీనాథ్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై అటు వైద్యులు గానీ, ఇటు కుటుంబసభ్యులు గానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.

ఆ తర్వాత, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మాగంటి గోపీనాథ్. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు.మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+