తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ను త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంతకుముందు.. ఝార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో ఝార్ఖండ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ది న్యాయవాద కుటుంబమే కావడం విశేషం. ఆయన తల్లి వైపు తాతగారు దివంగత బిపి సిన్హా భారతదేశ ఆరవ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.












Click it and Unblock the Notifications