Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#JusticeForChaithra: మరో దిశ: ఎన్‌కౌంటర్ కోసం డిమాండ్: పరామర్శించనున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: హైదరాబాద్‌లోసి సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకున్న ఆరేళ్ల చిన్నారి ఛైత్ర అత్యాచారం.. హత్య ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటన పట్ల యావత్ దేశం స్పందిస్తోంది. #JusticeForChaithra హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లు ఛైత్ర హత్యోదంతంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన పళ్లకొండ రాజును ఎన్‌కౌంటర్ చేయాలంటూ నినదిస్తోన్నారు.

దిశ కేసు ఘటనలో వ్యవహరించినట్టే

దిశ కేసు ఘటనలో వ్యవహరించినట్టే పోలీసులు- ఛైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ విడుదల చేసిన అతని ఆనవాళ్లతో కూడిన ఫొటో, ఇతర వివరాలను వేలాదిగా ట్వీట్లు, రీట్వీట్లు చేస్తోన్నారు. నటుడు మంచు మనోజ్ ఛైత్ర కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ట్వీట్లు చేసిన వారిలో చాలామంది సెలెబ్రిటీలు ఉన్నారు. సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు, క్రికెటర్ హనుమ విహారీ ఉన్నారు.

మానవమృగాన్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ..

సైదాబాద్ సింగరేణి కాలనీలో నివసించే రాజు అనే వ్యక్తి ఆరేళ్ల చిన్నారి ఛైత్రపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేశాడు. చిన్నారి మృతదేహాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టి పారిపోయాడు. చిన్నారి కనిపించకుండా పోవడంతో అన్ని చోట్లా గాలించిన కుటుంబ సభ్యులు రాజుపై అనుమానం రావడంతో అతని ఇంటి తాళాలు పగులగొట్టి చూడగా ఛైత్ర విగతజీవిగా కనిపించింది. ఆ ఘటనతో సింగరేణి కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రగిలిన నెటిజన్లు..

చిన్నారి హత్యాచార ఘటనపై బస్తీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజు స్వస్థలం నల్లగొండ జిల్లా చందంపేట్ మండలం. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన అతను ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిస. చిల్లర దొంగతనాలు చేస్తూండేవాడు. సింగరేణి కాలనీ, సైదాబాద్‌లల్లో తరచూ స్థానికులతో ఘర్షణకు దిగేవాడు. భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. రాజును పట్టిచ్చిన వారికి 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

ఫోన్ నంబర్లు ఇవే..

నిందితుడి ఫొటో, ఆనవాళ్లను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలియజేయాలనుకొనేవారు ఈస్ట్‌జోన్‌ డీసీపీకి 9490616366 లేదా టాస్క్‌ఫోర్స్‌ డీసీపీకి 9490616627 ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మొత్తం 10 టీమ్‌లను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్లకు చెందిన ఐటీ సెల్స్‌ రాజు కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నాయి. రాజు సెల్‌ఫోన్‌ ఏ టవర్ పరిధిలో స్విచ్చాఫ్‌ అయిందో తెలుసుకుని, ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. అన్ని జిల్లాలకు అతని ఫొటోతోపాటు వివరాలనూ పంపించారు.

అదుపులో నిందితుడు స్నేహితుడు

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో తప్పించుకుని తిరగడానికి అతను ప్రయత్నిస్తాడనే అనుమానంతో డ్రైవర్లు, కండక్టర్లను అలర్ట్ చేశారు. అతని ఆనవాళ్లను ఆర్టీసీ ఉద్యోగులందరికీ పంపించారు. బస్సుల్లో అతని ఫొటోలను అతికించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ దారుణం అనంతరం రాజు పారిపోవడానికి అతని స్నేహితుడు సహకరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

    Manchu Manoj : సైదాబాద్‌ చిన్నారి హత్యాచారం.. న్యాయం కోసం నిలబడ్డ Tollywood || Oneindia Telugu

    పరామర్శించనున్న వైఎస్ షర్మిల..

    ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఛైత్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    ఛైత్ర కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆమె సైదాబాద్ సింగరేణి కాలనీకి వెళ్లనున్నారు. ఆమె వెంట పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు ఉంటారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడతారని పార్టీ నాయకులు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+