ఆగస్టు 4న తెలంగాణలో భూకంపం..?

ఆగస్టు 4న.. తెలంగాణలో భూకంపం రానుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కానీ ఇది ప్రకృతి వైపరిత్యాల కారణంగా సంభవించే భూకంపం కాదు. రాజకీయ భూకంపం. అవును.. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమి కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. అయితే దీనిపై విచారణకు రిటైర్డ్ జడ్డి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా ఈ కమిషన్ తుది నివేదిక ఆగస్టు 1 న సీఎం రేవంత్ కు చేరింది. ఆగస్టు 4న నివేదిక సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించనుంది కమిషన్. అదే రోజు కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. కాళేశ్వరం రిపోర్టుపై చర్చించనుంది. దీంతో ఆగస్టు 4న ఏం జరుగుతుందోనని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు, నిర్మాణ లోపాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కమిషన్ తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను జూలై 31న రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పినాకి చంద్ర ఘోష్.. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఆగస్టు 1న ఈ నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు అందించారు. ఈ కమిటీ ఆగస్టు 4న నివేదిక సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్‌ కు వివరించనుంది. మొత్తం 650 పేజీలు, మూడు వాల్యుమ్ లుగా ఉన్న ఈ నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్.. తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను పొందుపరిచారు. ఆగస్టు 4న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌ పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీని ఆయకట్టు 45 లక్షల ఎకరాలు. ఈ ప్రాజెక్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను రీ- డిజైనింగ్ చేశారు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తి పోయడ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. అయితే, 2023 అక్టోబర్‌ లో మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని స్తంభాలు కూలిపోవడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజ్ సమస్యలు రావడంతో ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది.

Justice PC Ghosh Commission Hands Over Kaleshwaram Probe Report to CM Revanth Reddy

ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు జరిగిన విచారణలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌ తో సహా 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది. తాజాగా ఆగస్టు 1 న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవచ్చనీ..అవినీతి ఆరోపణలపై ED, ACB సంస్థల ద్వారా మరింత విచారణ జరిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+