కవిత రాజీనామాలో ట్విస్ట్..!
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. అయితే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కల్వకుంట్ల కవిత ఫోన్ లో మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే తాను అందుబాటులో లేనని, రేపు మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని గుత్తా తెలిపారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. ఈ క్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కల్వకుంట్ల కవిత ఫోన్ లో సంభాషించారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే తాను అందుబాటులో లేనని రేపు మరోసారి ఫోన్ లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపినట్లు సమాచారం.
ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. ఈ లేఖను స్వీకరించిన భవన్ సెక్రటరీ రిసీవ్డ్ కాపీ అందజేశారు.

మరోవైపు త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అలాగే కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు తెలిపారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (TBRS), బీఆర్‌ఎస్ పాత పార్టీ పేరు టీఆర్‌ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications