కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ స్టేషన్లు, టైమింగ్స్ : ప్రత్యేకంగా...!!

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్ (Vande Bharat) రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రెండు రైళ్లకు ఇది అదనం. ఈ నెల 24న ప్రధాని మోదీ 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి కేటాయించారు. కాచిగూడ- యశ్వంత్ పూర్, విజయవాడ -చెన్నై వందేభారత్ రైళ్లు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రయాణీకులకు రెగ్యులర్ సేవలు ప్రారంభిస్తాయి. ఈ రైళ్ల స్టేషన్లు.. సమయాలను అధికారులు ఖరారు చేసారు.

కొత్తగా రెండు వందేభారత్:విజయవాడ-చెన్నై(Vijayawada - Chennai) వందేభారత్‌ విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌ వరకు నడుస్తుంది. వారంలో గురువారం ఒక్క రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ ట్రైన్ నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఈ ట్రైన్ ప్రతి రోజూ(గురువారం మినహా) ఉదయం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది. అదే విధంగా 20703 / 20704 కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ వారంలో శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

Kachiguda - Yeshwantpur Vandebharat to being on 25th, Check Stops and timings here

స్టేషన్లు - సమయాలు:20703/20704 కాచిగూడ - యశ్వంత్ పూర్)Kachiguda - Yeshwantpur) వందేభారత్ 612 కిలీ మీటర్లను నాలుగు హాల్ట్ లతో 8.30 గంటల ప్రయాణ సమయంతో గమ్య స్థానం చేరుకుంటుంది. ఉదయం 5.30 గంటలకు కాచిగూడ లో బయల్దేరి మహబూబ్ నగర్ ఉ 6.59 కి చేరుతుంది. 7 గంటలకు బయల్దేరి కర్నూలు సిటీకి ఉ 10.54 కివస్తుంది. అక్కడి నుంచి ధర్మవరం ఉ 11.25 గంటలకు చేరుతుంది.

మధ్నాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్ పూర్ లో మద్నాహ్నం 2.45 బయల్దేరి ధర్మవరం సా 5.20, అనంతపురం 5.41, కర్నూలు సిటీ సా 7.51, మహబూబ్ నగర్ రాత్రి 9.40 కి చేరుకొని..అక్కడ నుంచి కాచిగూడకు రాత్రి 11.15 కు తిరిగి చేరుతుంది. వందేభారత్ (Vande Bharat)లో కొత్తగా తీసుకొస్తున్న సదుపాయాలు ఈ రైలులో అందుబాటులోకి రానున్నాయి.

Kachiguda - Yeshwantpur Vandebharat to being on 25th, Check Stops and timings here

ప్రత్యేక సదుపాయాలు:వందే భారత్ రైళ్లలో(Vande Bharat Trains) కొత్త కోచ్ లలో మెత్తటి కుషన్ లను వాడనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చారు. ఫుట్ రెస్ట్ ను మరింతగా పొడగించనున్నారు.సీట్ల వెనక మ్యాగజైన్ బ్యాగ్స్ ఏర్పాటు చేసారు. సీట్ల రిక్లైనింగ్ యాంగిల్ ను పెంచారు. దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు.

అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు. కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+