Kadiyam Srihari సంచలన స్టేట్‌మెంట్. రేవంత్ రెడ్డి భయపడి రాజీనామా చేయనివ్వలేదు
ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికలకు భయపడుతుందా? అంటే ఎవరైనా నో అనే సమాధానమే చెప్తారు. కానీ నేరుగా ఆ విషయాన్ని ఉపఎన్నికల్లో పోటీ చేయబోయే వ్యక్తే చెబితే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీనే అధిక శాతం విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదా? ఉప ఎన్నికలు వస్తే నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే పోటీకి దిగబోతున్నారా? అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్ లో సీనియర్ నేత చెప్పిన సీక్రెట్స్ ఏంటి?
ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓటమి తప్పదని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారే విమర్శను ఎన్నో సార్లు చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ అయితే ఈ అంశాన్నే బాగా టార్గెట్ చేసుకుని ఉప ఎన్నికలు వస్తే పోటీకి తగ్గేదేలే అన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్ లో గెలిచిన కాంగ్రెస్ ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి డీలా పడేలా నడుచుకుంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ వాదనకు బలం చేకూరేలా మాజీ మంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్ లో కీలక తనకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన అంతర్గత విషయాన్ని బయటపెట్టేశారు.
బై పోల్ జరిగితే..
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ వేటు వేసే లోపు ఆయన స్వయంగా రాజీనామా చేస్తే ఉపఎన్నిక అనివార్యమవుతుంది. బై పోల్ జరిగితే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎంత ఉందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ కాంగ్రెస్ గెలుపును ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. కడియంతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడితే తెలంగాణలో మిని సార్వత్రిక సంగ్రామం జరిగినట్లే.. మరి అప్పుడు జరిగే ఉపఎన్నికల్లో ఎవరు గెలిస్తే తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా వారిదే విజయం అని భావించాల్సిన పరిస్థితి వస్తుంది. మరో వైపు ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ పాలనకు అల్టిమేటంగా కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ చేయడం లేదనే విమర్శ ఇప్పటి వరకు గాల్లో దీపంలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ లా మారిపోయింది.

నేరుగా కేసీఆరే పోటికి దిగితే..
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. కాంగ్రెస్ తరఫున అసెంబ్లీలో అడుగుపెడతానని కడియం ప్రతిపాదనను రేవంత్ తోసిపుచ్చారని సమాచారం. కడియంతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అదే సీన్ ను ఫేస్ చేశారని టాక్ నడుస్తుంది. ఉపఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆందోళనను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. నేరుగా మాజీ సీఎం కేసీఆర్ పోటికి దిగితే కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని భావించే.. కడియం రాజీనామాకు సీఎం నిరాకరించినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే.. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా అని. కడియం శ్రీహరి చెప్పిన మాట ప్రకారం చూస్తే కేసీఆర్ కచ్చితంగా పోటీలో దిగుతారని తేలిపోయింది.
నేను రాజీనామా చేస్తా..
ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంలో ఉప ఎన్నికలకు రేవంత్ భయపడుతున్న విషయం పరోక్షంగా వెల్లడించారు. "నేను రాజీనామా చేస్తా అంటే రేవంత్ రెడ్డి వద్దన్నాడు..!! నేను రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డికి ఎప్పుడో చెప్పాను. కానీ ఉప ఎన్నిక వస్తే తనను ఓడించడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతాడని రేవంత్ రెడ్డి భయపడి రాజీనామా చేయనివ్వలేదు. క్రియాశీల రాజకీయాల్లో పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి " అని కడియం శ్రీహరి మీడియాకు సంచలన విషయాన్ని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications