వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల సొమ్ముతో పొట్టలు పెంచారు: కడియం శ్రీహరి

గత పాలకులు, ప్రస్తుత ప్రతిపక్షాల నాయకులు ప్రజల సొమ్మును దోచుకుని పొట్టలు పెంచారని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము తిని సీబీఐ కేసుల్లో ఇరుకున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

|
Google Oneindia TeluguNews

పరకాల: గత పాలకులు, ప్రస్తుత ప్రతిపక్షాల నాయకులు ప్రజల సొమ్మును దోచుకుని పొట్టలు పెంచారని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము తిని సీబీఐ కేసుల్లో ఇరుకున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశం మొత్తం గౌరవించేలా అభివృద్ధి పనులు జరుగుతుంటే.. ప్రతిపక్షాల నాయకులకు చెవులు వినబడకపోతే కళ్లు కనిపించడం లేదా? అని మండిపడ్డారు.

పరకాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెలా రూ. 36 కోట్లతో ఆసరా పింఛన్‌ పథకంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రూ. 16,500 కోట్లతో రైతులకు రుణమాఫీ, రాష్ట్రంలోని ప్రతీ హాస్టల్‌లో సన్నబియ్యం అందిస్తోందన్నారు.

kadiyam srihari

దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తుంటే ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే నడిపోస్తోదన్నారు. అంతేకాకుండా సింగరేణి, ఆర్టీసీ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, వీఆర్‌ఏల జీతాలను పెంచింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పరకాలను తప్పకుండా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

పాఠశాలల అదనపు గదుల కోసం భూములను కేయిస్తే భవనాలకు నిధులు ఇస్తామని, అధికారుల వెంటబడి పనిచేయంచుకోవాలని అన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని సీఎం కేసీఆర్‌ చేశారన్నారు. చేనేత కార్మికుల వలసలను నివారించేందుకు గీసుకొండ మండలంలో 1200 ఎకరాల్లో టెక్స్‌లైల్‌ పార్కు ఏర్పాటుకు భూసేకరణ జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతలు రాగానే ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

English summary
Telangana minister Kadiyam Srihari fired at opposition party leaders for corruptions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X