రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు: కేటీఆర్ ఎదుట తమ్ముడంటూనే కడియం చురకలు
వరంగల్: టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మరో సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ వైపు నుంచి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే కడియం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video


కేసీఆర్ ఆదేశాలతో..
తన కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వకపోవడంతో కొంత కాలంగా అంటిముట్టనట్లుగా వ్యవహరించిన కడియం.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ సభలో పాల్గొని ప్రసంగించారు.

రాజయ్యను గెలిపించాలి..
ఈ సందర్భంగా కడియం ప్రసంగిస్తూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసమ్మతి లేదు, సమ్మతి లేదంటూనే రాజకయ్యకు కడియం చురకలంటించారు.

రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు... కానీ
‘నేను నియోజకవర్గానికి రాకపోవడంతో అలిగానని బహుశా మీరంతా అనుకుంటున్నారేమో.. నేను నిజంగా చెబుతున్నా.. రాజయ్య అప్పుడప్పుడు నా పట్ల తప్పుగా ప్రవర్తించినా.. నేను ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదు' అని కడియం చెప్పారు.

రాజయ్యను తమ్ముడంటూ..
అంతేగాక, ‘రాజయ్య నా తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రాజయ్యను మనమందరం తప్పకుండా గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి' అని సభకు హాజరైన ప్రజలకు కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications