కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వాన ప్రక్రియను ప్రారంభించింది. డిజైన్ ఏజెన్సీ లను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఈ నెల 15 లోపు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ నీటిపారుదల వెబ్ సైట్లో పొందుపరిచింది. ఇక నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రిస్టోరేషన్ డిజైన్లను చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బారాజ్ లో పిల్లర్లకు పగుళ్లు, కుంగుబాటు వచ్చిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆహ్వానం పలికింది. డిజైన్ల కోసం అక్టోబర్‌ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్‌, రిపోర్టేషన్‌ డిజైన్లు చేయనుంది.

Kaleshwaram Twist Telangana Govt Invites Designs to Revive Medigadda Annaram amp amp Sundilla Barrages

ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవకతవకలను విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమగ్ర విచారణ అనంతరం ఈ కమిషన్ ప్రభుత్వానికి 600 పేజీలతో రిపోర్టును అందజేసింది. ఈ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీబీఐ కేసు విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. త్వరలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా పలువురు అధికారులను విచారించనున్నట్లు సమాచారం. దీనిపై సీబీఐ అధికారికంగా ప్రకటన చేయలేదు.

ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌ పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీని ఆయకట్టు 45 లక్షల ఎకరాలుగా ఉంది. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+