మాతృభూమి రుణం తీర్చుకోండి: ఆస్ట్రేలియాలో కవిత(పిక్చర్స్)

మెల్బోర్న్: మాతృభూమి రుణం తీర్చుకోవాలని తెలంగాణ ప్రవాసులకు పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస తెలంగాణీయులందరూ తెలంగాణలోని తమ గ్రామాలకు సేవ చేయాలని కోరారు. ఆస్ట్రేలియా అభివృద్ధిలో భాగస్వాములవుతూనే స్వదేశానికి సేవలందించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మెల్బోర్న్‌లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రేలియాలోని భారత వ్యాపారవేత్తలను కోరారు. విదేశాల్లోని తెలంగాణ జాగృతి శాఖలద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.

ఇప్పటికే యూకే, అమెరికా, బహ్రెయిన్, కువైట్, ముంబైలో శాఖలుండగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయ ప్రముఖులు ప్రఖ్యాత విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని, జాగృతి సిడ్నీ నాయకులు రాజేశ్ అర్శనపల్లి, కార్డియాలజిస్టు డాక్టర్ యాదూసింగ్, పంజాబీ అసోసియేషన్ అధ్యక్షుడు పరమ్ జైశ్వాల్, మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు రాజేశ్ తౌటిరెడ్డి, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ తంగెర్ల, ప్రవీణ్‌దేసం, స్మార్ట్ హైదరాబాద్ డైరెక్టర్ భరత్‌రెడ్డి పట్లోళ్ల తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఉదయం ఎంపీ కవిత గౌరవార్థం విందమ్ నగర మేయర్ గౌతమ్ గుప్తా ఇచ్చిన అల్పాహార విందులో పెట్టుబడులు, ఉపాధి కల్పన మంత్రి క్రెయిగ్ ఉండారిచ్, ఇండస్ ఏజ్ సంపాదకులు వినాయక్ కోప్లే తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇద్దరు తెలంగాణ పేద విద్యార్థులకు విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కార్యక్రమంలో ఉపకార వేతనం ప్రకటించింది.

ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రెజ్లర్ వినోద్‌కుమార్‌కు రెండు లక్షల రూపాయలను ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగమైన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్‌ఎస్‌ను కవిత లాంఛనంగా ప్రారంభించారు. దీనికి అధ్యక్షులుగా కాసర్ల నాగేందర్‌రెడ్డిని, ముఖ్య బాధ్యులుగా విజయ్ గంగసాని, సుమేశ్‌రెడ్డి సూర్యలను ప్రకటించారు.

అక్టోబర్‌లో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఎంపీ కవిత చెప్పారు. క్యారమ్‌డౌన్స్ ప్రాంతంలోని శివ విష్ణు ఆలయ ప్రాంగణం సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణవారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా కవితకు చిన్నారులు స్వాగతం పలికారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మౌనం పాటించారు.

ఈ కార్యక్రమాల్లో ఆస్ట్రేలియా బహుళ సంస్కృతులు, ఆసియా సంబందాల పార్లమెంటరీ సెక్రెటరీ హాంగ్ లిమ్, ఆస్ట్రేలియా బహుళ సంస్కృతుల షాడో మినిస్టర్ శ్రీమతి ఇంగా పులిచ్, పార్లమెంటు సభ్యులు ముర్రే థామ్సన్, సోనియా కిల్కెనీ, మెల్బోర్న్ లోని భారత కాన్సులేట్ జనరల్ రాకేష్ మల్హోత్రా, మాజీ విద్యామంత్రి, ప్రస్తుత ప్రభుత్వ అంతర్జాతీయ విద్యా సలహాదారులు ఫిల్ హనీవుడ్, లిబరల్ పార్టీ నాయకులు గ్యారీ స్పెన్సర్ లు అతిథులుగా హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

మాతృభూమి రుణం తీర్చుకోవాలని తెలంగాణ ప్రవాసులకు పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస తెలంగాణీయులందరూ తెలంగాణలోని తమ గ్రామాలకు సేవ చేయాలని కోరారు. ఆస్ట్రేలియా అభివృద్ధిలో భాగస్వాములవుతూనే స్వదేశానికి సేవలందించాలని సూచించారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మెల్బోర్న్‌లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రేలియాలోని భారత వ్యాపారవేత్తలను కోరారు. విదేశాల్లోని తెలంగాణ జాగృతి శాఖలద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

వివిధ సందర్భాలలో ఆస్ట్రేలియాలో జరిగిన హింసాత్మక సంఘటనలలో గాయపడ్డ భారత జాతీయులు తమ ఇబ్బందుల్ని తెలిపారు. తదనంతరం భారత విద్యార్థుల రక్షణకు తీసుకున్న చర్యల్ని అధికారులు వివరించారు. భారతీయుల రక్షణకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కవిత అభినందించారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఇప్పటికే యూకే, అమెరికా, బహ్రెయిన్, కువైట్, ముంబైలో శాఖలుండగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఎంపీ కవిత గౌరవార్థం విందమ్ నగర మేయర్ గౌతమ్ గుప్తా ఇచ్చిన అల్పాహార విందులో పెట్టుబడులు, ఉపాధి కల్పన మంత్రి క్రెయిగ్ ఉండారిచ్, ఇండస్ ఏజ్ సంపాదకులు వినాయక్ కోప్లే తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇద్దరు తెలంగాణ పేద విద్యార్థులకు విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కార్యక్రమంలో ఉపకార వేతనం ప్రకటించింది.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత రెజ్లర్ వినోద్‌కుమార్‌కు రెండు లక్షల రూపాయలను ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగమైన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్‌ఎస్‌ను కవిత లాంఛనంగా ప్రారంభించారు. దీనికి అధ్యక్షులుగా కాసర్ల నాగేందర్‌రెడ్డిని, ముఖ్య బాధ్యులుగా విజయ్ గంగసాని, సుమేశ్‌రెడ్డి సూర్యలను ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

అక్టోబర్‌లో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఎంపీ కవిత చెప్పారు. క్యారమ్‌డౌన్స్ ప్రాంతంలోని శివ విష్ణు ఆలయ ప్రాంగణం సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణవారు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా కవితకు చిన్నారులు స్వాగతం పలికారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మౌనం పాటించారు.

ఆస్ట్రేలియాలో కవిత

ఆస్ట్రేలియాలో కవిత

ఈ కార్యక్రమాల్లో ఆస్ట్రేలియా బహుళ సంస్కృతులు, ఆసియా సంబందాల పార్లమెంటరీ సెక్రెటరీ హాంగ్ లిమ్, ఆస్ట్రేలియా బహుళ సంస్కృతుల షాడో మినిస్టర్ శ్రీమతి ఇంగా పులిచ్, పార్లమెంటు సభ్యులు ముర్రే థామ్సన్, సోనియా కిల్కెనీ, మెల్బోర్న్ లోని భారత కాన్సులేట్ జనరల్ రాకేష్ మల్హోత్రా, మాజీ విద్యామంత్రి, ప్రస్తుత ప్రభుత్వ అంతర్జాతీయ విద్యా సలహాదారులు ఫిల్ హనీవుడ్, లిబరల్ పార్టీ నాయకులు గ్యారీ స్పెన్సర్ లు అతిథులుగా హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+