హెపటైటిస్‌పై అవగాహన అవసరం: సినీ నటుడు కళ్యాణ్‌రామ్(ఫొటోలు)
హైదరాబాద్: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని మంగళవారం సినీ నటుడు కళ్యాణ్‌రాంతో కలిసి అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. హెపటైటిస్ వ్యాధి పట్ల అందరిలో అవగాహన రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా గర్భిణులు హెపటైటిస్ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.

ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు అపోలో శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కళ్యాణ్ రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కెఎస్ సోమశేఖర్ రావు, డాక్టర్ పోలవరపు నవీన్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications