సిక్కులకూ కళ్యాణ లక్ష్మీ: ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్: సిక్కులకు కూడా కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు హామీ ఇచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే సంవత్సరం గురునానక్ జయంతి రోజున ప్రభుత్వ సెలవు ప్రకటిస్తామని తెలిపారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీక భాగ్యనగరమని కొనియాడారు. సిక్కుల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని చెప్పారు.

సిక్కుల కోసం రూ. కోటీతో సామాజిక భవనం నిర్మిస్తామని, సిక్కులకు కూడా కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గురుద్వార్ హైదరాబాద్‌లో ఉండాలని సిఎం ఆకాంక్షించారు. గురుద్వార్ నిర్మాణం కోసం తన వ్యక్తిగతంగా రూ. లక్షా 16 వేలు ప్రకటించారు. గురుద్వార్ నిర్మాణం కోసం మూడెకరాల భూమి కేటాయిస్తామని తెలిపారు.

Kalyana Laxmi scheme will expand to sikhs says kcr

ప్రభుత్వం బురద జల్లుతున్నాయి: పోచారం

విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో, కుటుంబ సమస్యలతో ఎవరైన చనిపోతే రైతు ఆత్మహత్యలుగా చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన రైతు ఆత్మహత్యల వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు బడ్జెట్ అని మరో మంత్రి పోచారం శ్రీనివాస్ అన్నారు. రైతు ఆత్మహత్యలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కారణమని అన్నారు. విద్యుత్‌ను రాత్రికి రాత్రే ఉత్పత్తి చేయలేమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+